Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ సైంధవ్ నుంచి గాయత్రిగా సారా పరిచయం

Webdunia
సోమవారం, 17 జులై 2023 (17:48 IST)
Venkatesh-sara
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్‌మార్క్  చిత్రంలో 'సైంధవ్‌'గా తన ఫెరోషియస్ షేడ్స్ ఇప్పటివరకు చూశాము. ఇప్పుడు అతని లోతైన భావోద్వేగాన్ని పరిచయం చేశారు. బేబీ సారా హార్ట్ ఆఫ్ సైంధవ్ అని రివిల్ చేశారు మేకర్స్.  పోస్టర్‌ లో పాప వెంకటేష్‌ ను కౌగిలించుకోవడం చూడవచ్చు. పోస్టర్ లో వెంకటేష్‌ గాయాలతో కనిపిస్తున్నారు. సినిమాలో సారా పాత్ర పేరు గాయత్రి. ఈమె తమిళ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె. ధనుష్, విక్రమ్ హీరోల సినిమాల్లో నటించింది. 
 
'HIT' ఫ్రాంచైజ్ తో వరుసవిజయాలు అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైంధవ్ హై-ఆక్టేన్ యాక్షన్‌ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు. సారా పాత్ర హార్ట్ అఫ్  సైంధవ్.
 
ఈ చిత్రంతో బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖ్ వికాస్ మాలిక్  క్యారెక్టర్ లో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. శ్రద్ధా శ్రీనాథ్ మనోజ్ఞ పాత్రలో కథానాయికగా నటిస్తుండగా, డాక్టర్ రేణుగా రుహాని శర్మ, జాస్మిన్ పాత్రలో ఆండ్రియా జెర్మియా కీలక పాత్రలలో నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం.. తండ్రి వెళ్లగా..?

అయ్యప్ప భక్తులకు అండగా నిలిచిన నారా లోకేష్.. పనితీరు భేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే 9 ప్రయోజనాలు

అనుకోకుండా బరువు పెరగడానికి 8 కారణాలు, ఏంటవి?

ఉడికించిన వేరుశనగ పప్పు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments