సైంధవ్ నుంచి జాస్మిన్‌గా ఆండ్రియా జెర్మియా పరిచయం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:44 IST)
Andrea Jeremiah
విక్టరీ వెంకటేష్ 75వ ల్యాండ్ మార్క్ మూవీ 'సైంధవ్' కు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇందులో కొంతమంది ప్రముఖ నటీనటులు కీలక పాత్రలలో నటించనున్నారు. ఈ కీలక పాత్రల కోసం దర్శకుడు పెర్ఫార్మార్స్ ను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిక్ ఈ చిత్రంతో టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. మనోజ్ఞ పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇటీవలె రుహాని శర్మ పాత్రను డాక్టర్ రేణు గా పరిచయం చేశారు.
 
ఈరోజు ఈ సినిమాలో మరో కీలక పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ ఆండ్రియా జెర్మియా ఈ చిత్రంలో జాస్మిన్ పాత్రలో నటిస్తున్నారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో చేతిలో తుపాకీతో ఇంటెన్స్ లుక్ తో కనిపించింది ఆండ్రియా. పోస్టర్ లో స్పోర్ట్స్ బైక్‌ను కూడా గమనించవచ్చు.
 
ప్రధాన తారాగణం పాల్గొంటున్న సైంధవ్ షూటింగ్ ప్రస్తుతం వైజాగ్‌లో జరుగుతోంది. ప్రముఖ సాంకేతిక ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.
 
ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్  పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

Students: పాదాలకు విద్యార్థులచేత మసాజ్ చేసుకున్న టీచర్.. వీడియో వైరల్

రూ.20 కోట్ల ఆస్తి కోసం భర్తను కిడ్నాప్ చేసింది.. కానీ పోలీసులకు చిక్కింది.. ఎలా?

టెలివిజన్ నటిపై లైంగిక వేధింపులు.. ఫ్రెండ్ రిక్వెస్ట్ కొంపముంచింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments