Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస‌క్తిగా విశాల్ నాట్ ఎ కామ‌న్ మ్యాన్ (video) ‌

Webdunia
శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (18:34 IST)
Visal 31 movie
ఇటీవ‌ల చ‌క్ర సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన యాక్ష‌న్ హీరో విశాల్ ప్ర‌స్తుతం త‌న స్నేహితుడు ఆర్యతో క‌లిసి `ఎనిమి` సినిమా చేస్తున్నారు. ఆ సినిమా త‌ర్వాత `ఈదు థెవైయో అధువే ధర్మం` అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తు.ప. శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ఓ భారీ సినిమా చేయ‌బోతున్నారు. విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని విశాల్‌ ఫిలిం ఫ్యాక్ట‌రి బేన‌ర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5గంట‌ల‌కు ఈ మూవీకి సంబందించి అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్‌ ఇచ్చారు మేక‌ర్స్‌. 
 
ఈ సంద‌ర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. న‌డుస్తున్న జ‌న‌సందోహం నుండి విశాల్ ఫేస్‌ని చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామ‌న్ మ్యాన్ (#Not A Common Man)అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు.

ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువ‌న్‌ శంక‌ర్‌రాజా సంగీతం అందిస్తుండ‌గా బాల‌సుబ్ర‌మ‌ణ్యం సినిమాటోగ్ర‌పి భాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్ట‌ర్‌, ఎన్ బి శ్రీ‌కాంత్ ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.  ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు మేక‌ర్స్‌.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments