Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తి రేపుతున్న విజయ్ ఆంటోనీ హత్య ఫస్ట్ లుక్

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (18:17 IST)
Vijay Antony, Hathya First Look
డాక్టర్ సలీమ్, బిచ్చగాడు, బేతాళుడు వంటి విభిన్న చిత్రాలతో ఆకట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా 'హత్య'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో ఆయన నటిస్తుండగా..నాయిక రితికా సింగ్ సంధ్య అనే పాత్రలో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను బుధవారం చిత్రబృందం విడుదల చేశారు.
 
ఓ హత్య కేసు ఇన్వెస్టిగేషన్ కోసం కథానాయకుడు రంగంలోకి దిగినట్లు పోస్టర్ ద్వారా తెలుస్తున్నది. పోస్టర్ లో మురళీ శర్మ, రాధికా శరత్ కుమార్ లాంటి పాత్రలను రివీల్ చేశారు. వీళ్లను అనుమానితులుగా హీరో భావిస్తున్నట్లు ఉంది. హ్యాట్ , కోటుతో డిటెక్టివ్ లుక్ లో సహజంగా కనిపిస్తున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన కెరీర్ లో ఇదొక డిఫరెంట్ ఫిలిం అవుతుందని అనుకోవచ్చు. '1923లో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన డోరతీ కింగ్ మర్డర్ ఘటన నేపథ్యంగా 'హత్య'  సినిమా సాగనుంది. 
ఇతర కీలక పాత్రల్లో జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, మురళీ శర్మ, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు.
 
ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ గతంలో విజయ్ ఆంటోనీతో కలిసి ‘విజయ్ రాఘవన్’ అనే చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఈ కాంబోలో 'హత్య' సినిమా నిర్మితమవుతుండగా..త్వరలో మరో రెండు ప్రాజెక్ట్ లు కలిసి చేస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాళేశ్వరం మూడు బ్యారేజీలను మరమ్మతు చేసేందుకు తెలంగాణ సన్నాహాలు

హైదరాబాద్ సిటీ కాలేజీలో పైథాన్ కలకలం.. (వీడియో)

భర్త మరో స్త్రీతో ఎఫైర్: కాల్ రికార్డ్, లొకేషన్ తెలుసుకునే హక్కు భార్యకు వుందన్న హైకోర్టు

భార్య మీద అలిగిన ఓ భర్త కరెంట్ స్తంభం ఎక్కాడు, ఆ తర్వాత?

ఆఫ్ఘనిస్థాన్‌లో సంపూర్ణ ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ - స్తంభించిన సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments