Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలుకి చేసిన‌ స‌ర్జ‌రీని సైతం లెక్క చేయ‌ని నాగ‌శౌర్య‌... అస‌లు ఏమైంది..?

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (14:22 IST)
ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో ప్రొడ‌క్ష‌న్ నెం.3గా తెర‌కెక్కిస్తున్న చిత్రం షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతుండ‌గా హీరో నాగ‌శౌర్య కాలికి గాయం అయిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత హైద‌రాబాద్ చేరుకుని రెస్ట్ తీసుకున్నారు. డాక్ట‌ర్ల స‌లహా మేర‌కు చిన్న స‌ర్జ‌రీ జ‌రిగింది. ఇటీవ‌ల త‌ను న‌టించిన ఓ బేబీ ఫంక్ష‌న్‌కి హాజ‌ర‌య్యారు. 
 
యాక్సిడెంట్ అయిన త‌రువాత మొద‌టిసారిగా ఓ బేబి ఫంక్ష‌న్‌కి మాత్ర‌మే వ‌చ్చారు. కాలు జాయింట్ ద‌గ్గ‌ర న‌రాలు చిట్ల‌డంతో దాదాపు నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు చెప్పారు. కానీ.. త‌ను న‌టించిన చిత్రం వేడుక‌కు హాజ‌రు కావ‌టం త‌న ధ‌ర్మం అని భావించిన నాగ‌శౌర్య ఓ బేబి ఫంక్ష‌న్‌కి హాజ‌రు కావ‌టం జ‌రిగింది.

ఇప్ప‌ుడు కూడా ఆర్టిస్టులు తేదీలు ఎడ్జ‌స్ట్మెంట్ స‌మ‌స్య కాకూడ‌దని భావించి షూటింగ్‌కి హాజ‌ర‌య్యారు. ఈ రోజు నుండి హైద‌రాబాద్‌లోని మ‌ల‌క్‌పేట ప్రాంతంలో షూటింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టారు. మొద‌టి షాట్ కూడా హీరో నాగ‌శౌర్య మీదనే చిత్రీక‌రించారు.
 
ఛ‌లో లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియోష‌న్స్ బ్యాన‌ర్లో వ‌స్తున్న ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చిత్ర స‌మ‌ర్ప‌కుడు శంక‌ర్ ప్ర‌సాద్, లైన్‌ ప్రొడ్యూస‌ర్ బుజ్జిలు చిత్ర యూనిట్‌ని ఫ్యామిలి మెంబ‌ర్స్‌లా చూసుకుంటున్నారు.

నాగ‌శౌర్య‌కి యాక్సిడెంట్ జ‌రిగింద‌ని తెలుసుకున్న‌ యూనిట్ స‌భ్యులు హీరోని ప‌ర్స‌న‌ల్‌గా క‌లిసి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకున్నారు. నిర్మాత ఉషా ముల్పూరి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ద‌ర్శ‌కుడు ర‌మ‌ణ తేజ విజ‌న్‌కి త‌గ్గ‌ట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐరా క్రియేష‌న్స్ హస్పిటాలిటికి కేరాఫ్ అడ్రెస్‌గా టాలీవుడ్‌లో పేరుంది. దానికి త‌గ్గ‌ట్టుగానే వారి ప్రేమానురాగాలు యూనిట్ మొత్తంమీద చూపిస్తారు. ఈ చిత్రంలో నాగ‌శౌర్యకి జంట‌గా మెహరీన్ నటిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

Sharmila: జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ దత్తపుత్రుడు.. వైఎస్ షర్మిల ఫైర్

నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ- రూ.5,000 కోట్ల ఆర్థిక సాయంపై విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments