Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్రగంటి మల్టీస్టారర్‌లో అంతా తెలుగువారే

దర్శకుడిగా "గ్రహణం"తో కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తపడతారు. తెలుగువారంటే ఆయనకి ముందు నుంచీ ప్రత్యేకమైన అభిమానం.

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (16:27 IST)
దర్శకుడిగా "గ్రహణం"తో కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఇంద్రగంటి తన సినిమాల్లో ఎక్కువ శాతం తెలుగు నటీనటులు, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తపడతారు. తెలుగువారంటే ఆయనకి ముందు నుంచీ ప్రత్యేకమైన అభిమానం. ఆయన తెరకెక్కించిన "మాయాబజార్, ఆష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్, అంతకుముందు ఆ తర్వాత, బందిపోటు, జెంటిల్‌మెన్" వంటి చిత్రాల్లో ఎక్కువ మంది తెలుగు ఆర్టిస్ట్స్, టెక్నీషియన్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకొనేవారు. ఇప్పుడు ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం కోసం అందరూ తెలుగు వారే ఉండేలా ప్లాన్ చేసుకొన్నారు. 
 
అవసరాల శ్రీనివాస్, అడివి శేష్ కథానాయకులుగా తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రంలో మన తెలుగమ్మాయిలైన ఈష, అదితి మ్యానికల్‌లను కథానాయికలుగా ఎంపిక చేశారు. ఈ చిత్రానికి పని చేసే టెక్నీషియన్లు కూడా అందరూ తెలుగు వారినే తీసుకొన్నారు. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 1న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. 
 
ఈ చిత్రంలో తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments