Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘భారతీయుడు 2’ ఆగిపోవడానికి కారణమిదేనా??

Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (18:37 IST)
విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌‌కి సూపర్ హిట్ సాధించి పెట్టిన భారతీయుడు సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు 2’ సినిమా ఆగిపోయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.


నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు, దర్శకుడు శంకర్‌కు మధ్య బడ్జెట్‌ విషయంలో అభిప్రాయభేదాలు వచ్చాయని అందుకే సినిమా ఆగిపోయిందని కొందరు చెప్పగా... సంగీత దర్శకుడిగా ఏ.ఆర్‌ రెహమాన్‌ను కాకుండా అనిరుధ్‌ రవిచందర్‌ను తీసుకోవడం కూడా శంకర్‌కు నచ్చలేదని మరికొందరు చెప్పుకొచ్చారు. అయితే చిత్రబృందం నుండి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. 
 
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన మరో తాజా విషయం బయటకు వచ్చింది. సినిమాలో కమల్‌హాసన్‌కు వేస్తున్న మేకప్‌ వల్ల ఆయనకు అలెర్జీ వస్తోందనీ... మొదట్లో మేకప్‌ కారణంగా కమల్‌కు అలెర్జీ రావడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆపారనీ చెప్పుకొస్తున్నారు. కొంతకాలం గ్యాప్‌ ఇచ్చి మళ్లీ మేకప్‌ వేసి చూడగా మళ్లీ అదే పరిస్థితి ఎదురైందట. 
 
దాంతో ఆయనకు కొన్ని రోజుల పాటు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. అదీ కాకుండా సినిమా మొత్తంలో దాదాపు కమల్‌ వృద్ధుడి గెటప్‌లోనే ఉండాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ సేపు మేకప్‌తోనే ఉండాల్సి ఉంటుంది. మున్ముందు అలెర్జీ ఎక్కువైతే సమస్యలు ఎదురవుతాయని భావించిన చిత్రబృందం ప్రస్తుతం చిత్రీకరణ ఆపివేసినట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.
 
దాదాపు 21 ఏళ్ల తర్వాత కమల్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ‘భారతీయుడు 2’పై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కాజల్‌ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్నారు. వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్‌ చేపట్టిందా?.. సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి.. పాక్‌ను ఛీకొట్టిన దేశాలు...

కాశ్మీర్‌లో సాగుతున్న ఉగ్రవేట... ఆయుధాలతో ఇద్దరి అరెస్టు - యుద్ధ సన్నద్ధతపై కీలక భేటీ!!

సజ్జల రామకృష్ణారెడ్డి భూదందా నిజమే.. నిగ్గు తేల్చిన నిజ నిర్ధారణ కమిటీ

Insta Friend: ఇన్‌స్టా ఫ్రెండ్.. హోటల్ గదిలో వేధించాడు.. ఆపై వ్యభిచారం

Pawan Kalyan: తమిళనాడు మత్స్యకారులపై దాడులు.. పవన్ కల్యాణ్ స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments