Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ నెల 18న నందు హారర్ థ్రిల్లర్ ''ఐందవి'' విడుదల

Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (19:34 IST)
నందు హీరోగా నటించిన కొత్త సినిమా 'ఐందవి'. హారర్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కించారు దర్శకుడు ఫణిరామ్ తుఫాన్. సన్నీ అండ్ విన్నీ సినిమాస్ పతాకంపై శ్రీధర్ లింగం నిర్మించారు. అనురాధ నాయికగా నటించిన ఈ చిత్రంలో ఛత్రపతి శేఖర్, దిలీప్, అవంతిక ఇతర కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'ఐంద‌వి' సినిమా ఈ నెల 18న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది.
 
ఈ సందర్భంగా నిర్మాత శ్రీధర్ లింగం మాట్లాడుతూ....లాక్ డౌన్ ముందే మా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. థియేటర్లు లేకపోవడంతో ఇన్నాళ్లూ ఆగాం. సినిమాను థియేటర్ లో చూస్తే వచ్చే అనుభూతి వేరు. అందుకే కొంత ఆలస్యమైనా మంచి థియేటర్‌లలో ఐందవి సినిమాను విడుదల చేస్తున్నాం. హారర్ థ్రిల్లర్ కథతో సినిమా సాగుతుంది. 
 
జన సంచారం లేని ప్రాంతంలో సరదాగా కొన్ని రోజులు గడుపుదామని ఆరుగురు వ్యక్తులు వెళ్తారు. ఆ ప్రాంతంలో వారు ఒకరి తర్వాత ఒకరు హత్యలకు గురవుతారు. ఆ హత్యలు చేసిందెవరు, ఐందవికి ఈ హత్యలకు సంబంధం ఏంటి అనేది కథాంశంగా ఉంటుంది. సవారి సినిమా తర్వాత నందు ఫర్మార్మెన్స్ బాగా చేసిన చిత్రమిది. అన్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం - ఎస్ఏ ఆర్మాన్, సినిమాటోగ్రఫీ - భరత్ సి కుమార్, సమర్పణ - రాజేశ్వరి తుమ్మల. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments