Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లైమాక్స్ సన్నివేశాల్లో నితిన్ చిత్రం తమ్ముడు

డీవీ
మంగళవారం, 21 జనవరి 2025 (14:24 IST)
Nitn-Tammudu
నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ "తమ్ముడు". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది. ఈ చిత్రంలో లయ కీలక పాత్రను పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థతో హీరో నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణుకు మంచి అనుబంధం ఉంది.

హీరో నితిన్ దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ చేయగా..దర్శకుడు శ్రీరామ్ వేణు నాని హీరోగా ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇప్పుడు ఈ ముగ్గురి కాంబినేషన్ లో "తమ్ముడు" సినిమా వస్తుండటం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది.
 
"తమ్ముడు" సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సంక్రాంతి ఫెస్టివల్ బ్రేక్ లేకుండా శరవేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు వీలైనంత త్వరగా హై క్వాలిటీతో మూవీ కంప్లీట్ చేసేందుకు శ్రమిస్తున్నారు. ప్రేక్షకులకు మర్చిపోలేని సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ను "తమ్ముడు" సినిమాతో అందించబోతున్నారు దర్శకుడు శ్రీరామ్ వేణు. త్వరలోనే "తమ్ముడు" సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనుమానం పెనుభూతమైంది... భార్య కడుపై కూర్చొని భర్త చిత్రహింసలు - నిండు చూలాలు మృతి!!

కొత్తగా 10 రైళ్లను ప్రవేశపెట్టిన భారతీయ రైల్వే.. ముందస్తు రిజర్వేషన్ లేకుండానే...

డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... జన్మతః పౌరసత్వం చట్టం

Tulasi Reddy: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి.. నవ్వు తెప్పిస్తుంది.. తులసి రెడ్డి

ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తనపని మొదలెట్టిన డోనాల్డ్ ట్రంప్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments