Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామారావు ఆన్ డ్యూటీ లో సాయం చేస్తున్న ర‌వితేజ‌

Webdunia
శనివారం, 25 డిశెంబరు 2021 (12:50 IST)
Rama Rao on Duty poster
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతోన్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది.
 
రవితేజ యాక్షన్ ప్యాక్డ్ రోల్‌లో కనిపించబోతోన్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో రవి తేజ ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. రవితేజ చేస్తోన్న సాయం, అది అందుకున్న వారి కళ్లలో ఆనందం పోస్టర్‌లొ కనిపిస్తోంది. మన గురించి మనం కాకుండా పక్క వారి గురించి ఆలోచించి సాయం చేస్తే దాని కంటే గొప్ప సంతోషం ఎక్కడా ఉండదు అని పోస్టర్ మీద రాసి ఉంది.
 
దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఇంకా ముఖ్య మైన నటీనటులెంతో మంది ఉన్నారు.
 
సామ్ సీఎస్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 
ఈ చిత్రం యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్  పోస్టర్‌కు అద్బుతమైన స్పందన వచ్చింది. ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తరువాత ప్రమోషన్స్‌లో  జోరు పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది.
 
నటీనటులు : రవితేజ, దివ్యాంశ కౌశిక్ కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు
 
కథ, కథనం, మాటలు, దర్వకత్వం : శరత్ మాండవ,  నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ, ఆర్‌టీ టీం వర్క్స్,  సంగీతం : సామ్ సీఎస్,  సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్ ఐఎస్‌సీ,  ఎడిటర్ : ప్రవీణ్ కేఎల్, ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడలో ఎన్‌కౌంటర్ - శాఖమూరి అప్పారావు భార్య మృతి!

అనకాపల్లి-అచ్యుతాపురం మధ్య 4 లైన్ల రోడ్డు రాబోతోంది: నారా లోకేష్

అవకాశం వస్తే మళ్లీ స్టార్‌లైనర్‌లో ఐఎస్ఎస్‌లోకి వెళ్తా : సునీతా విలియమ్స్ (Video)

ఏప్రిల్ 1న ఫూల్స్ డే ఎలా వచ్చిందో తెలుసా?

కోటాలో 18 ఏళ్ల జేఈఈ అభ్యర్థి ఆత్మహత్య.. రైల్వే ట్రాక్‌పై పడి.. ఐడీ కార్డు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments