Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాలేజీలో మీనాక్షి అనేవారు - సాయిపల్లవి లా ఉత్త‌మ పాత్ర‌లు చేయాలి - గీత్ సైని

Webdunia
గురువారం, 11 నవంబరు 2021 (18:26 IST)
Geet Saini
నేను కాలేజీలో డాన్స్ చేసేదానిని. న‌న్ను అంద‌రూ మీనాక్షిలా వున్నావ‌ని అనేవారు. ఇప్పుడు అలాంటి పేరుతో పాత్ర చేయ‌డం, అందులోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ బేన‌ర్‌లో ఛాన్స్ రావ‌డం  చెప్ప‌లేని ఆనందాన్ని క‌లిగించింద‌ని - న‌టి గీత్ సైని తెలియ‌జేసింది.
 
"పుష్పక విమానం" చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అవుతున్న మరో తార గీత్ సైని. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో మీనాక్షి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మీనాక్షి అనే క్యారెక్టర్ లో నటించడం, ఆ మూడ్ లో ఉండిపోవడానికి చాలా కష్టపడ్డానని చెబుతోంది గీత్ సైని. "పుష్పక విమానం" సినిమా చూస్తే నాయికగా తన ఎఫర్ట్ తెలుస్తందని అంటోంది. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తున్న "పుష్పక విమానం" చిత్రంలో నటించిన ఎక్సీపిరియన్స్ ను మీడియాతో పంచుకుందీ యంగ్ హీరోయిన్.
 
గీత్ సైని మాట్లాడుతూ...కాలేజ్ డేస్ నుంచి నాకు డాన్సులు చేయడం అంటే  చాలా ఇష్టం. డాన్సులతో పాటు తెలుగు కామెడీ చిత్రాలు చూడటం ఇంట్రెస్ట్ ఉండేది. మా ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీతో ఎలాంటి రిలేషన్ లేదు. నేను సినిమాల్లోకి వస్తానంటే ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారని అనుకోలేదు. పుష్పక విమానం సినిమా ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి, నా స్నేహితురాలు ఒకరు నా ఫొటోస్ పంపింది. ఆడిషన్ చేసినప్పుడు మీనాక్షి క్యారెక్టర్ కు నేను బాగా సరిపోతాని దర్శకుడు దామోదర సెలెక్ట్ చేశారు. మీనాక్షి చిట్టిలంక సుందర్ వైఫ్. తను పెళ్లయ్యాక ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మీనాక్షి క్యారెక్టర్ లో నటించడం అంత సులువు కాదు. ఎప్పుడూ ఒక మూడ్ లో ఉండాల్సి వచ్చేది.

సెట్ లో ఎవరైనా జోక్ వేసినా, నా మూడ్ లోనే ఉండేందుకు అస్సలు రెస్పాండ్ అయ్యేదాన్ని కాదు. అలా మీనాక్షి క్యారెక్టర్ ను ప్లే చేశాను. పుష్పక విమానం చూశాక ఆడియెన్స్ నా క్యారెక్టర్ ను ఇష్టపడతారు. ఆనంద్ చాలా మంచి వ్యక్తి. షూటింగ్ టైమ్ లో చాలా సపోర్టివ్ గా ఉండేవారు. నా కెరీర్ లో ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమా చేస్తాననుకోలేదు. అందుకే ఈ సినిమా రిలీజ్ అయ్యేదాకా మరో ప్రాజెక్ట్ చేయొద్దని, వచ్చిన కొన్ని ఆఫర్స్ కూడా వదులుకున్నాను. సాయి పల్లవిలా డాన్స్ బేస్డ్ క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అని  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

మా సిఫార్సు లేఖలను పరిగణనలోకి తీసుకోండి.. బీఆర్ నాయుడికి హరీశ్ వినతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments