Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూసైడ్ చేసుకోవాలని భావించిన గోవా బ్యూటీ

గోవా బ్యూటీ ఇలియానా. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ఈ గోవా బ్యూటీ నటించి మంచి గుర్తింపు పొందడమేకాకుండా, తెల

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (15:29 IST)
గోవా బ్యూటీ ఇలియానా. స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన హీరోయిన్. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన అనేక చిత్రాల్లో ఈ గోవా బ్యూటీ నటించి మంచి గుర్తింపు పొందడమేకాకుండా, తెలుగు స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాలక్రమంలో ఈ అమ్మడికి అవకాశాలు లేకపోవడంతో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోంది. పైగా, అపుడపుడూ ఈతకొలనులో ఉంటూ అదిరిపోయే ఫోటోలను తీయించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ తానున్నట్టు సినీ అభిమానులకు గుర్తుచేస్తుంది.
 
అయితే, ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ మెంటల్ హెల్త్ అనే కార్యక్రమానికి ఈ భామ హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన జీవితంలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి వివరించింది. తన శరీరం గురించి పలువురు పలు రకాల కామెంట్స్ చేసినప్పుడు తాను చాలా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయిందట. ఒకానొక టైంలో సూసైడ్ కూడా చేసుకోవాలని భావించిందట. కానీ అంతలోనే తనకి తానే ధైర్యం చెప్పుకొని నార్మల్ స్టేజ్‌కి వచ్చానని చెబుతోంది ఇలియనా. 
 
డిప్రెషన్ నుండి బయటపడాలంటే ముందుగా మనకు మనం ధైర్యం తెచ్చుకోవాలని అంటుంది గోవా బ్యూటీ. డిప్రెషన్‌లోకి వెళ్లినప్పుడు వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని తన అనుభవాన్ని వెల్లడించింది. నటీమణులు అందంగా కనిపించడానికి రెండు గంటల సమయం పడుతుంది, కానీ మనసు ప్రశాంతంగా ఉంటే ఎలాంటి మేకప్‌లు లేకుండా చాలా గ్లామర్‌గా కనిపిస్తారని ఈ సన్నజాజితీగనడుం చిన్నది చెపుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

జైళ్లలో ఏం జరుగుతోంది.. వైకాపా నేతలకు రాచమర్యాదలా? అధికారులపై సీఎం సీరియస్

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments