Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కూలీ' చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌కు షాకిచ్చిన ఇళయరాజా!

ఠాగూర్
గురువారం, 2 మే 2024 (14:00 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మరోమారు షాకిచ్చారు. సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రం 'కూలీ'ని నిర్మిస్తున్న సన్ పిక్చర్స్‌కు కాపీరైట్ నోటీసులు జారీ చేశారు. ఈ చిత్రం టీజర్‌లో తన సంగీతాన్ని నేపథ్యంగా వాడటాన్ని ఆయన ఖండిస్తూ, ఈ నోటీసులు జారీచేశారు. 'కూలీ' చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. ఇది రజినీకాంత్ నటించే 171వ చిత్రం. ఈ చిత్రం టైటిల్‌తో పాటు టీజర్‌ను తాజా రిలీజ్ చేశారు. ఇందులో "వా వా పక్కం వా" అనే పాటలోని సంగీతాన్ని బ్యాక్‌గ్రౌండ్‌గా ఉపయోగించారు. 
 
తన అనుమతి లేకుండా ఉపయోగించిన ఆ పాట సంగీతాన్ని వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో ఆ పాటకు తగిన అనుమతి పొందాలని సన్ పిక్చర్స్‌కు ఇళయరాజా కాపీరైట్ నోటీసులు పంపించారు. అలా చేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇత తన సంగీతంలోని పాటలను తన అనుమతి లేకుండా స్టేజ్ షోలలో కూడా ఆలపించరాదని, సినిమాల్లోనూ ఉపయోగించరాదని గతంలో ఇళయారాజా ఆంక్షలు విధించిన విషయం తెల్సిందే. దానిని అతిక్రమించిన వారిపై ఆయన కేసులు పెడుతున్నారు కూడా. ఆ కోవలోనే ఇపుడు సన్ పిక్చర్స్‌కు  ఇళయరాజా కాపీరైట్ నోటీసులు పంపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments