నేను మా ఇంటి దగ్గర వీడియో విలేకరిపై దాడిచేశానని అంటున్నారు. అందుకు నేనూ చాలా బాధపడ్డాను. అతను నా మొహంపై కెమెరా పెట్టారు. అది నా కంటికి తగిలింది. నేను తప్పుకున్నాను. కానీ తగిలితే గుడ్డివాడిని అయ్యేవాడిని. ఆ తర్వాత ఎవరిని నేను ప్రశ్నించగలను. నేను మీడియా రాగానే నమస్కారం పెడుతూ వచ్చాను. రాగానే ఓ విలేకరి మొహంపై మైక్ పెట్టాడు. అది కంటికి తగిలింది. అందుకే దురుసుగా ప్రవర్తించాను. ఇందుకు అతనికి గాయమైంది అన్నారు. అందుకు నేను చాలా బాధపడుతున్నా. వారి కుటుంబానికి నేను చెబుతున్నాను. నేను కొట్టాల్సి వచ్చింది. అని గురువారంనాడు ఓ ఆడియో విడుదల చేశారు మోహన్ బాబు.