Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌రిశ్ర‌మ క‌ళ‌క‌ళ‌లాడాలంటే ఇలాంటి సినిమాలు ఆడాలిః ప్రకాష్ రాజ్‌

Webdunia
బుధవారం, 14 జులై 2021 (13:39 IST)
Narasimhapuram team
పలు సీరియల్స్, సినిమాల ద్వారా సుపరిచితుడైన నందకిశోర్ 'నరసింహపురం' చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటిస్తుండగా  ఉష హీరో చెల్లెలు పాత్రలో నటించారు. శ్రీరాజ్ బళ్ళా, టి.ఫణిరాజ్ గౌడ్‌, నందకిశోర్ ధూళిపాల నిర్మాతలు. కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా.
 
చిత్ర పోస్ట‌ర్‌ను ప్రకాష్ రాజ్ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని థియేటర్స్ లో విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రానికి విజయం సాధించేందుకు అవసరమైన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయని.. కరోన ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి "నరసింహపురం" చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్న హీరో-దర్శకనిర్మాతలను ఎంతైనా అభినందించేయాల్సిందేనని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. పరిశ్రమ పచ్చగా కలకళలాడాలంటే "నరసింహపురం" వంటి మీడియం బడ్జెట్ చిత్రాలు భారీ విజయాలు సాధించాల్సిన అవసరం చాలా ఉందన్నారు.
 
హీరో నందకిషోర్ మాట్లాడుతూ, ట్రైలర్, సాంగ్స్ చూసి ప్ర‌కాష్‌రాజ్‌గారు చాలా బాగుందని మెచ్చుకోవడం మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ మరింత పెంచింది. ఆయనకు మా యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. "నరసింహపురం'' చిత్రాన్ని ఈనెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. సెన్సార్ సభ్యులు సహా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన మా టీమ్ అందరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ చిత్రాన్ని ప్రాణాధికంగా ప్రేమించి.. ఈ చిత్రం ఎంతో అద్భుతంగా రావడానికి కారకుడైన మా దర్శకనిర్మాత శ్రీరాజ్ బళ్ళాకి స్పెషల్ థాంక్స్"" అన్నారు.
ఈ కార్యక్రమంలో హీరో నందకిషోర్, చెల్లెలు పాత్రధారి  ఉష, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రవివర్మ బళ్లా దర్శకుడు శ్రీరాజ్ బళ్లా, నిర్మాత ఫణిరాజ్ గౌడ్, సినిమాటోగ్రఫర్ కర్ణ ప్యారసాని, ప్రముఖ నటుడు సమీర్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments