Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దేవీ
బుధవారం, 23 ఏప్రియల్ 2025 (17:00 IST)
Gymkhana team with Director Harish Shankar, Anudeep
తెలుగు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్లకు ప్రముఖులను ఆహ్వానిస్తే వస్తారోరారో తెలీదు. అయితే అందుకు భిన్నంగా దర్శకుడు హరీష్ శంకర్ వున్నారు. తనకు కంటెంట్ నచ్చితే భాషతో సంబంధం లేకుండా ప్రమోషన్ కు వస్తాను అని మలయాళ సినిమా జింఖానా తెలుగులో విడుదల సందర్భంగా జరిగిన వేడుకకు హాజరయ్యారు.
 
డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ, 'జింఖానా' టీం అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్. ఈ సినిమాని సుబ్బారెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ ఖలీద్ రెహమాన్ బాక్సర్. కాబట్టే ఇలాంటి సినిమాని అద్భుతంగా తీయగలిగాడు. ట్రైలర్ లో షాట్స్ చాలా బావున్నాయి. తన ఫస్ట్ సినిమా చాలా బావుంటుంది. అది నా ఆల్ టైం ఫేవరేట్. ఈ సినిమా కూడా పెద్ద హిట్. నైజాం శశిగారు చేస్తున్నారు కాబట్టి ఇంక తిరుగువుండదు. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు సినిమా కంటెంట్ నచ్చితే భాష, చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడా లేకుండా ప్రమోట్ చేయడానికి ముందు వుంటాను. ఈ సినిమా ట్రైలర్ నాకు చాలా నచ్చింది. నస్లెన్ అద్భుతమైన పెర్ఫార్మ్.  ఈ సినిమాని అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడాలని కోరుకుంటున్నాను. ఏప్రిల్ 25న థియేటర్స్ లో చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు'అన్నారు.
 
డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ, ఈ సినిమా చాలా బావుంది. నేను చూశాను. స్పోర్ట్స్ కామెడీ చాలా బాగా తీశారు. తప్పకుండా మీరంతా మిస్ కాకుండా చూస్తారని కోరుకుంటున్నాను'అన్నారు.  
 
మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలుతో అలరించిన నస్లెన్ 'జింఖానా'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఖలీద్ రెహమాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయ్యింది. ఖలీద్ రెహమాన్, జోబిన్ జార్జ్, సమీర్ కారత్, సుబీష్ కన్నంచెరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడీ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 25న తెలుగు థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

Bengal: పట్టపగలే హత్య.. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి కుమారుడిని కాల్చి చంపేశారు

తిరుమలలో ఆసక్తికర దృశ్యం.. అనుకోకుండా ఎదురుపడిన రోజా, నారాయణ (వీడియో)

వేడి వేడి మిర్చి బజ్జీ ప్రాణం తీసేసింది

Jagan: జగన్ రాఖీ శుభాకాంక్షలు.. ట్రోల్స్ మొదలు- దోచుకున్న దాన్ని దాచడానికి పోరాటం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments