Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో తాగుబోతుల బారిన ప‌డ్డ‌ ప్రాచీ

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (20:48 IST)
Prachi Tehlan
నటి ప్రాచీ టెహ్లాన్ న‌టికాక‌ముందు బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్‌. ఆమె ఆట‌కు దిగితే క్వీన్ ఆఫ్ కోర్ట్ అనేవారు. అంత అందంగా వున్న ఆమె న‌ట‌న‌పై మ‌క్కువ‌తో పంజాబీలో సినిమాలో మొద‌ట‌గా న‌టించింది. ఇక మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి త‌దిత‌రులు న‌టించిన చారిత్రాత్మ‌క సినిమా `మ‌మంగం`లో రాజ న‌ర్త‌కిగా మైమ‌రిపించింది. అయితే టీవీ షోలుకూడా చేసిన ఆమెకు ఇటీవ‌లే ఓ చేదు అనుభ‌వం ఎదురైంద‌ట‌. త‌న జీవితంలోని ఓ భ‌యం క‌లిగించే అనుభ‌వాన్ని ఇలా చెబుతోంది.
 
ఓరోజు తను రాత్రి కారులో ఇంటికి వెళ్తున్నప్పుడు కొందరు తాగుబోతులు తనను వెంబడించారని తెలిపింది. ఆ సమయంలో తన భర్త కూడా కారులో ఉన్నాడని, అయినప్పటికీ వాళ్లు తమను అనుసరించడం మానుకోలేదని, ఏకంగా మా ఏరియాలోకి వచ్చేశారని పేర్కొంది. అప్పుడు చాలా భయపడ్డానన్న ప్రాచీ ఆ సమయంలో వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయోనని బిక్కుబిక్కుమంటూ గడిపామని చెప్పింది. ఫ్యామిలీ పార్టీకి వెళ్లి తిరిగొచ్చే క్రమంలో అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని గుర్తు చేసుకుంది. 
 
ఇలా తాగి ఇబ్బందులు పెట్టేవారిని వ‌ద‌ల‌కూడ‌ద‌ని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఆ త‌ర్వాత ఏమి జ‌రిగింద‌నేది వివ‌రించ‌లేదు. అయితే నేను పుట్టి పెరిగిన ఢిల్లీ అంద‌మైన ప్రాంత‌మే. కానీ అక్క‌డ అంతఅంద‌మైన మ‌నుషులు లేర‌నీ, ఢిల్లీ కంటే ముంబై అంతో ఇంతో నయమేనని అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments