Prabhas: ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా : డైరెక్టర్ మారుతి

దేవీ
సోమవారం, 24 నవంబరు 2025 (07:58 IST)
Prabhas song
రాజా సాబ్ రిలీజ్ కోసం మీ కంటే ఎక్కువగా మేము వెయిట్ చేస్తున్నాం. జనవరి 9న సినిమా వస్తుందా లేదా అనే సందేహాలు కొందరిలో ఉన్నాయి. కానీ ఖచ్చితంగా జనవరి 9న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల చేయబోతున్నాం. గ్లోబల్ గా అత్యధిక థియేటర్స్ లో లార్జెస్ట్ రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం. ఫస్ట్ డే అన్ని బాక్సాఫీస్ రికార్డులను మా సినిమా అధిగమిస్తుంది.
 

కాస్త ఆలస్యమైనా మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే అన్ని ఎలిమెంట్స్ తో గ్రాండ్ గా రూపొందిస్తున్నాం. ఫైట్స్, సాంగ్స్, డ్యాన్సెస్, ఎంటర్ టైన్ మెంట్, హారర్, యాక్షన్, గ్రాండ్ విజువల్స్ అన్నీ ఉంటాయి.  ఒక భారీ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రభాస్ గారిని గ్రూప్ ఆఫ్ డ్యాన్సర్స్ తో కలిసి చూసి చాలా రోజులైంది. మా సినిమాలో అలా గ్రూప్ డ్యాన్సర్స్ తో కొన్ని సాంగ్స్ రూపొందించాం. దాదాపు వెయ్యిమంది గ్రూప్ డ్యాన్సర్స్ తో రూపొందించిన రెబల్ సాబ్ సాంగ్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రభాస్ గారు ఎక్కువ రోజులు వర్క్ చేసిన సినిమా మాదే కావొచ్చు. ఆయన స్వీట్ పర్సన్. ప్రభాస్ గారితో ఇంత బిగ్ మూవీ చేయడం హ్యాపీగా ఉంది అని ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్  అన్నారు.
 
రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ రాజా సాబ్. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ ప్రమోషన్స్ తో ఈ సెలబ్రేషన్స్ ను బిగిన్ చేశారు మూవీ టీమ్. సినిమా ఫస్ట్ సాంగ్ 'రెబల్ సాబ్'ను హైదరాబాద్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు.
 
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - మీ మొహాల్లో ఈ నవ్వు చూడటం కోసమే కష్టపడుతున్నాం. మా టీమ్ అంతా పడేది మామూలు కష్టం కాదు. ఈ సినిమాతో పండక్కి మీరంతా కాలర్ ఎగరేసుకుంటారు అని చెప్పను. ఎందుకంటే ఈ సినిమాకు ప్రభాస్ గారి కటౌట్ కు అది చాలా చిన్న మాట. మీ మనసుల్లోకి రెబల్ గాడ్ అని ఎలా వచ్చిందో తెలియదు. కానీ నేనిప్పుడు ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా. చిన్న కాలేజ్ లో చదివేవాడిని, అలాంటిది ఆయన నీకు టాలెంట్ ఉంది రమ్మంటూ తన యూనివర్సిటీలోకి అహ్వానించారు. నాకు అర్హత ఉందో లేదో తెలియదు కానీ ఆయన యూనివర్సిటీలోకి వెళ్లాక ఆయనను అర్థం చేసుకుంటూ ప్రతి రోజూ ఆయన ఫొటో జేబులో పెట్టుకుని వర్క్ చేస్తున్నా. ప్రభాస్ గారి ఫొటో జేబులో ఉంటే ఎలాంటి వాడైనా టాప్ డైరెక్టర్ అయిపోతాడు. అందులో డౌట్ లేదు. కల్మషం లేని మనస్తత్వం, ప్రేమతోనే అందరినీ దగ్గర చేసుకుంటాడు. రెండేళ్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నానంటే నేను అదృష్టవంతుడిని అనుకుంటా. మీ కేరింతలతో "రాజా సాబ్" థియేటర్స్ మార్మోగుతాయి. నేను ప్రతి రోజూ ఆ ఎగ్జైట్ మెంట్ చూస్తున్నా. మీ లాంటి అభిమానులను ఊహించుకునే వర్క్ చేస్తున్నా. దాదాపు 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ గారు ఇలాంటి పాట చేశారంటే అది కేవలం మన కోసమే. ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి ఫస్ట్ మనమంతా థ్యాంక్స్ చెప్పాలి. ఎంతో ఎఫర్ట్స్ పెట్టి పండక్కి "రాజా సాబ్" సినిమాను మన ముందుకు తీసుకొస్తున్నారు. ప్రభాస్ గారు ఇచ్చిన కంఫర్ట్, ప్రోత్సాహం వల్లే ఇంత బాగా మూవీని రూపొందించగలిగాను. ముగ్గురు హీరోయిన్స్ తో ప్రభాస్ గారి పర్ ఫార్మెన్స్, వారి కెమిస్ట్రీ స్క్రీన్ మీదే చూడాలి. అభిమానులు నాపై పెట్టుకున్న హోప్స్ కు ఒక పర్సెంట్ ఎక్కువే ఇస్తా.  మేము ఒక్కొక్కటిగా ఇవ్వబోయో కంటెంట్ తో మీరంతా రిలీజ్ ముందు వరకు రెబల్ ఆరాలో ఉంటారు. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

సి.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది? 'ఐబొమ్మ' రవి తండ్రి

విమాన ప్రయాణికులకు శుభవార్త ... త్వరలో తీరనున్న రీఫండ్ కష్టాలు...

ఎక్కడో తప్పు జరిగింది... కమిటీలన్నీ రద్దు చేస్తున్నా : ప్రశాంత్ కిషోర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments