Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి.. ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌కి నో అంటున్న శ్రుతి

తన క్లాస్ మెట్స్‌తో పోలిస్తే రంగు తక్కువగా ఉన్నందుకు బాల్యంలో శ్రుతి హసన్ యమ బాధపడేదట. శ్రుతి రూపం బాగున్నా రంగు మాత్రం అందరూ కోరుకునే తెలుపు కాదు. రంకు తక్కువగా ఉండి తోటి విద్యార్థినుల ముందు తేలిపోవడంతో చిన్నప్పుడు చాలా బాధపడేదట. తెల్లగా ఉండి ఉంటే

Webdunia
గురువారం, 4 మే 2017 (07:15 IST)
తన క్లాస్ మెట్స్‌తో పోలిస్తే రంగు తక్కువగా ఉన్నందుకు బాల్యంలో శ్రుతి హసన్ యమ బాధపడేదట. శ్రుతి రూపం బాగున్నా రంగు మాత్రం అందరూ కోరుకునే తెలుపు కాదు. రంకు తక్కువగా ఉండి తోటి విద్యార్థినుల ముందు తేలిపోవడంతో చిన్నప్పుడు  చాలా బాధపడేదట. తెల్లగా ఉండి ఉంటే బాగుండేది కదా అని పదే పదే భావించేదట
కానీ వయసు పెరిగి, సినీరంగంలో అవకాశాలు అంది పుచ్చుకుని పరిణితి చెందిన శ్రుతి ఇప్పుడు నలుపు తెలుపు రంగు భేదాలు జానేదేవ్ అంటున్నారు.


తెల్లరంగు లేమని బాధపడేవారి కోసం ఏదైనా మంచి ఫెయిర్ నెస్ క్రీమ్ గురించి సూచిస్తారా అని శ్రుతిని ప్రశ్నిస్తే బుర్ర తిరిగే సమాధానం చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రంగుకు ప్రాధాన్యత ఇవ్వనని, రంగుభేదాల గురించి ఊదర గొట్టే కాస్మెటిక్స్‌ని అసలు ప్రమోట్ చేయనని ఆమె ఖరాఖండీగా చెప్పారు.
 
నేను ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని ప్రమోట్‌ చేయను. ఎందుకంటే, నా చిన్నప్పటిలా ఇప్పుడు నేను రంగుకి ప్రాధాన్యం ఇవ్వడంలేదు. రంగు తక్కువగా ఉన్నామని ఎందుకు బాధపడాలి అందుకే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఫెయిర్‌నెస్‌ క్రీమ్స్‌ని ప్రమోట్‌ చేయను. అలాగే, ఆల్కహాల్‌కి కూడా బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేయను. ఎందుకంటే, మద్యం ఆరోగ్యానికి హాని చేస్తుంది’’ అని చెప్పారు శ్రుతిహసన్
 
తండ్రి కమల్ హసన్ లాగే చాలా విషయాలపై హేతు పూర్వకంగా ఆలోచించే శ్రుతిహసన్ తన రూపంలాగే తన భావాలు కూడా చక్కగా ఉన్నాయని ఈ మాటలతో నిరూపించుకుంది కదా..
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments