ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్యం చెబుతా : శరత్ కుమార్

Webdunia
మంగళవారం, 30 మే 2023 (15:52 IST)
తమిళనాడు రాష్ట్రంలో వచ్చే 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను ముఖ్యమంత్రిని చేస్తే 150 యేళ్లు జీవించే రహస్య విద్యను చెబుతానని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, సినీ హీరో శరత్ కుమార్ ప్రకటించారు. మదురైలో జరిగిన ఆ పార్టీ సర్వసభ్య సమావేశంలో శరత్ కుమార్ మాట్లాడుతూ, మద్యం దేహాన్ని కుంగదీసి మానసిక ఒత్తిడిని కలుగజేస్తుందన్నారు. గంజాయి, గుట్కా తదితరాల వాడకం మనిషి పెరుగుదలను వేగంగా నియంత్రిందన్నారు. 
 
2025 నాటికి అత్యధిక యువకులతో కూడిన దేశంగా భారత్‌ మారుతుందని గణాంకాలు చెబుతున్నాయని, దేశంలో యువశక్తిని నియంత్రించేందుకే విదేశాల నుంచి మత్తుపదార్థాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిపారు. 69 ఏళ్ల వయసున్న తాను 150 ఏళ్ల వరకు జీవించేందుకు రహస్యాన్ని కనుగొన్నాని, 2026లో తనను ముఖ్యమంత్రిని చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఏడు అడుగుల ఎత్తున్న మహిళ.. షాకైన భక్తులు (Video)

39 ఫామ్‌హౌస్‌లలో ఆకస్మిక తనిఖీలు.. డీజేలు, హుక్కా, మద్యం.. స్కూల్ స్టూడెంట్స్ ఎలా?

చేవెళ్ల ప్రమాదంలో తల్లి మృతి.. తండ్రి, ముగ్గురు పిల్లలు బయటపడ్డారు...

సారీ డాడీ, ఆమెను వదిలి వుండలేకపోతున్నా, అందుకే మిమ్మల్ని వదలి వెళ్లిపోతున్నా: యువకుడు ఆత్మహత్య లేఖ

కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, దుస్తులు తీసేసి పరార్ అయిన కామాంధులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments