Webdunia - Bharat's app for daily news and videos

Install App

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

దేవీ
బుధవారం, 9 జులై 2025 (14:44 IST)
RK Sagar and team
బుల్లితెరపై స్టార్ గా ఎదిగిన ఆర్.కె. సాగర్ సినిమారంగంపై మక్కువతో సినిమాలు చేశాడు. తాజాగా ది 100 సినిమా చేశాడు. పోలీసు పాత్రలో నటించాడు. ఓ ముగ్గురి అధికారుల జీవితాన్ని క్రోడీకరించి సినిమాగా మార్చామని చెబుతున్నాడు. ఈ సినిమా ఈనెల 11న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా పబ్లిసిటీ కోసం హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ల చుట్టూ టీమ్ తో తిరుగుతున్నాడు. 
 
మొగలిరేకులు టైంలో ప్రతి ఇంటిలోకి వెళ్లిపోయాను. అలా పేరు రావడం దేవక్రుపగా భావిస్తున్నా. నాపేరు ఎంతలా మారిపోయిందంటే.. మా స్నేహితుడి నాన్నగారు చివరిస్టేజీలో వున్నారు. అనారోగ్య సమస్యలతోపాటు మతిమరుపు బాగా వుండేది. ఇంట్లోవారిని కూడా గుర్తుపట్టేవారు కాదు. కానీ టీవీలో నా సీరియల్ ప్రసారం అయ్యేసరికి కుర్చీలో కూర్చుని ఆర్.కె. నాయుడు వచ్చాడా? అంటూ టీవీని చూసి చెప్పేవాడు. అలా నా పేరు బాగా గుర్తుండిపోయింది. పనిమాల నన్నుపిలిపించుకున్నారు. అలాంటి వ్యక్తి ఆ తర్వాత చనిపోయాడని తెలిసే చాలా ఫీలయ్యా.. అంతలా నన్ను గుర్తుపెట్టుకున్న ఆయన చనిపోవడం చాలా బాధేసింది.
 
ఇక ది 100 సినిమాపరంగా చెప్పాలంటే, సి.పి. ఆనంద్ ను పోలిన కేరెక్టర్ నా పాత్రలో వుంటుంది. పోలీసులు గర్వించే సినిమా అవుతుంది. గతంలో పోలీసు సినిమాలు వచ్చినా ఇది పూర్తి విరుద్ధంగా వుంటుంది. దానికి సీక్వెల్ గా వుంటుందని చివరిలో చెప్పాం. అనుకూలిస్తే సీక్వెల్ చేస్తాం అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోటపల్లి ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం వేధింపులు.. రోడ్డెక్కిన బాలికలు

పప్పు రుచిగా లేదని క్యాంటీన్ ఆపరేటర్‌పై దాడి చేసిన శివసేన ఎమ్మెల్యే (video)

కొట్టుకున్న కోడళ్లు... ఆపేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన అత్త

Influencer: టర్కీలో పబ్లిక్ ప్లేసులో చీరకట్టుకున్న మహిళా ఇన్ఫ్లుయెన్సర్ (video)

నాకు దక్కనిది మరెవరికీ దక్కదు : ప్రియురాలి గొంతుకోసి హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments