Dr. Rajasekhar: మంచి సబ్జెక్ట్ రాలేదనే నిరాశ ఉండేది : డాక్టర్ రాజశేఖర్

చిత్రాసేన్
సోమవారం, 3 నవంబరు 2025 (15:34 IST)
Sharva, Dr. Rajasekhar
హీరో తో పాటు మంచి క్యారెక్టర్స్ కూడా చేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత చాలా కథలు విన్నాను. అందులో చాలా వరకు నాకు నచ్చేవి కాదు. మంచి సబ్జెక్ట్ రాలేదనే నిరాశ ఉండేది. అలాంటి సమయంలో డైరెక్టర్ అభి వచ్చారు. బైకర్ స్టోరీ చెప్పారు. అద్భుతమైన సబ్జెక్టు. ఈ సినిమా చేస్తే మంచి పేరు వస్తుందని ఒప్పుకున్నాను అని డాక్టర్ రాజశేఖర్ అన్నారు.
 
హీరో శర్వా స్పోర్ట్స్, ఫ్యామిలీ డ్రామా బైకర్ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని UV క్రియేషన్స్ నిర్మించింది. ఇటీవలే శర్వా స్పోర్ట్స్ గేర్‌తో  బైకర్ అవతార్‌లో ఉన్నట్లు చూపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శర్వా జిమ్ స్టిల్స్ కూడా వైరల్ అయ్యాయి. ఈరోజు, మేకర్స్ సినిమా ఫస్ట్ ల్యాప్ గ్లింప్స్‌ను లాంచ్ చేశారు.
 
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. అభి ప్రతి ఫ్రేమ్ ని అద్భుతంగా డిజైన్ చేశారు. ప్రతిరోజు చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉండేది. వంశి సూపర్ ప్రొడ్యూసర్. చాలా కూల్ గా ఉంటారు. ఈ సినిమాకి అయిన ఖర్చు చూస్తే నాకు భయం పుట్టేది.  కానీ వంశీ గారు ఎప్పుడు చాలా కూల్ గా ఉండేవారు. శర్వా గారు చాలా కోపరేటివ్. చాలా రెస్పెక్ట్ ఫుల్. ఈ సినిమా డబ్బింగ్ చూసి శర్వా గారు నా దగ్గరకు వచ్చి 'రాజశేఖర్ గారు మీరు చాలా అద్భుతంగా చేశారు. మీరు ఈ క్యారెక్టర్ చేసినందుకు థాంక్స్' అని చెప్పారు. అది నాకు పెద్ద అవార్డుతో సమానం. బైకర్ సినిమా మీరు చూడండి. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్నారు.
 
శర్వా మాట్లాడుతూ.. రాజశేఖర్ తో పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తున్నప్పుడు నిజంగానే గూజ్ బంప్స్ వచ్చాయి. బైకర్..  ఫస్ట్ మోటోక్రాస్ రేసింగ్ ఫిల్మ్ ఇన్ ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పగలం. ఈ సినిమా చేయడం అంత ఈజీ కాదు. చాలా పెద్ద ఛాలెంజ్. ఇందులో కనిపించినది ఏది కూడా సీజీ షాట్ కాదు. ఒరిజినల్ బైకర్స్ తో తీసిన ఒరిజినల్ స్టంట్స్. ఇండోనేషియా వెళ్లి బైకర్స్ తో అక్కడ షూట్ చేసి వచ్చాం. చాలా రిస్కులు,  ఛాలెంజులు తీసుకున్నాం. ఒక గొప్ప సినిమా చేశామని గర్వంగా చెప్పుకోగలం. ఈ సినిమా కెరియర్ లో టర్నింగ్ పాయింట్. ఎందుకు టర్నింగ్ పాయింట్ అనేది మరో స్టేజ్ లో మాట్లాడుతాను. ఇలాంటి సినిమా చేయాలంటే నిర్మాతలకి గట్స్ ఉండాలి. వంశీ అన్న థాంక్యూ. గర్వంగా ఇది నా సినిమానే చెప్పుకునే సినిమా ఇచ్చినందుకు. అభి అద్భుతమైన కథ రాసుకొని వచ్చారు. ఫెంటాస్టిక్ గా తీశాడు . ఈ సినిమా  ఒక మ్యాజిక్.  మీ అందరికీ సినిమా ఎప్పుడెప్పుడు చూపించాలని ఎదురుచూస్తున్నాను.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల ప్రమాద స్థలంలో హృదయ విదారక దృశ్యాలు: బాధితులకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఆ బస్సును అక్కడే వుంచండి, అపుడైనా బుద్ధి వస్తుందేమో?

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకేసారి తిరిగి రాని లోకాలకు వెళ్లిన ముగ్గురు సోదరీమణులు

విశాఖ నగరంలో ఘోరం- ఏడు నెలల గర్భిణి.. అన్యోన్యంగా జీవించిన దంపతులు.. ఆత్మహత్య

College student: కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments