Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ జీన్స్ ప్యాంటు చిరుగుళ్లెందుకు పవన్.. వాటి మీద దృష్టి పెట్టు: వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ట్విట్టర్లో స్పందించాడు. తాను ఎప్పుడూ తల్లిపై ఒట్టేయలేదని.. ఇక పవన్ గురించి కానీ.. మెగా ఫ్యామిలీ గురించి కానీ నెగటివ్‌గా మాట్లాడన

Webdunia
ఆదివారం, 13 మే 2018 (11:53 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ట్విట్టర్లో స్పందించాడు. తాను ఎప్పుడూ తల్లిపై ఒట్టేయలేదని.. ఇక పవన్ గురించి కానీ.. మెగా ఫ్యామిలీ గురించి కానీ నెగటివ్‌గా మాట్లాడనని వర్మ.. పవన్‌పై మళ్లీ నోరెత్తాడు. తాజాగా పవన్ కళ్యాణ్, రవితేజని ఉద్దేశించి వర్మ చేసిన ట్వీట్స్ సంచలనంగా మారాయి. మాస్ మహా రాజా రవితేజ నటించిన నేలటిక్కెట్ ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 
 
పవన్ కళ్యాణ్, రవితేజ కలసి ఆడియో వేడుకలో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో పవన్, రవితేజ పక్కపక్కనే కూర్చున్నారు. రవితేజ ధరించిన రగ్గుడ్ జీన్స్ ప్యాంటు ఆసక్తికరంగా కనిపించడంతో పవన్ కళ్యాణ్ రవితేజ ప్యాంటులోని చిరుగుళ్లను పరిశీలించారు. ఈ విషయాన్ని కూడా వర్మ వివాదం చేసే ప్రయత్నం చేశాడు. రవితేజ జీన్స్ తొడలపై పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి రెండు రాష్ట్రాలపై పెడితే సస్యశ్యామలమవుతాయని వర్మ సెటైర్ వేయడం సంచలనంగా మారింది.
 
నేల టిక్కెట్టు ఆడియో వేడుకలో జరిగిన సరదా సన్నివేశాన్ని కూడా వర్మ ఇలా తన వ్యాఖ్యలతో పవన్ అభిమానులని రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు. కాని గతంలోలా పవన్ కళ్యాణ్ అభిమానులు వర్మ ట్వీట్స్‌ని ఏమాత్రం పట్టించుకోలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొనసాగుతున్న ఉత్కంఠత : 24 గంటల్లో కీలక ప్రకటన..?

రాంగోపాల్ వర్మ ఎక్కడున్నారు? పోలీసులు ఎందుకు ఆయన కోసం వెతుకుతున్నారు

ఏక్‌నాథ్ షిండేను తప్పించే వ్యూహాల్లో కమలనాథులు : శివసేన నేత ఆరోపణలు

బ్రిటీష్ హయాంలో చేపట్టిన రైల్వే లైను సర్వే ఇప్పటికీ పుర్తి చేశారబ్బా.. !!

సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో రిజర్వేషన్ లేదు : న్యాయశాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments