Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఇంకా దానికి బానిసను కాలేదు : నటి విద్యాబాలన్

సినీ సెలెబ్రిటీలు అభిమానులకు దగ్గరగా ఉండేందుకు, తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఇపుడు సోషల్‌ మీడియా ఓ చక్కటి వేదికగా మారింది. ముఖ్యంగా హీరోహీరోయిన్లు తాము చేసే సినిమాల వివరాలు, వ్యక్తిగత విషయాలను బహిరంగ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (06:07 IST)
సినీ సెలెబ్రిటీలు అభిమానులకు దగ్గరగా ఉండేందుకు, తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఇపుడు సోషల్‌ మీడియా ఓ చక్కటి వేదికగా మారింది. ముఖ్యంగా హీరోహీరోయిన్లు తాము చేసే సినిమాల వివరాలు, వ్యక్తిగత విషయాలను బహిరంగ పరిచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 
 
నటీనటులంతా సోషల్ మీడియా ఖాతాను కలిగివున్నప్పటికీ కొందరైతే ఏ అమావాస్యకో, పౌర్ణమికో మాత్రమే ఆప్‌డేట్స్‌ ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన బాలీవుడ్ సుందరాంగి విద్యాబాలన్. దీనిపై ఆమె స్పందిస్తూ 'ట్విట్టర్‌ అకౌంట్‌ చాలా కాలంగా ఉంది. కానీ రెగ్యులర్‌గా ఫాలోకాను. ఏదొక విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు సరదాగా ఓపెన్ చేస్తానని చెప్పుకొచ్చింది. 
 
ఒకవేళ ఓపెన్ చేసినా 5 నిమిషాలు మించి ఉండను. ఏదైనా ట్వీట్‌ చేశాక.. 'నేనేనా ట్వీట్‌ చేసింది' అని ఆశ్చర్యపోతా. సోషల్‌ మీడియాతో మంచిచెడూ రెండూ ఉన్నాయి. శిరీశ కుందర్‌ ట్వీట్లను ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తా. ఈ ఫేస్‌బుక్‌ కూడా ఓపెన్ చేశా. ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం ఎక్కువగా ఫొటోలు పెడుతుంటా. అలాగని సోషల్‌మీడియాకు నేను అడిక్ట్‌ కాలేదు. త్వరలో యాక్టివ్‌ అవుతా' అని తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుంటూరులో చిన్న షాపు.. ఆమెతో మాట్లాడిన చంద్రబాబు.. ఎందుకు? (video)

పవన్ చిన్న కుమారుడిని పరామర్శించిన అల్లు అర్జున్

దుబాయ్‌లో ఇద్దరు తెలుగు వ్యక్తులను హత్య చేసిన పాకిస్థానీ

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర : ఎండీ సజ్జనార్ వెల్లడి

తిరుమల గిరుల్లో వైసీపీ నిఘా నేత్రాలు : భూమన కరుణాకర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments