Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ణిర‌త్నం క‌ల‌కు జీవితాన్నిచ్చా - ఐశ్వ‌ర్యరాయ్‌

Webdunia
శనివారం, 24 సెప్టెంబరు 2022 (10:00 IST)
Aishwarya Rai , trisha
ప్రస్తుతం తమిళ్ సినిమా నుంచి వస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో  “పొన్నియిన్ సెల్వన్ 1” ఒకటి. చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తీ తదితర ఎందరో స్టార్ నటులు నటించిన ఈ చిత్రాన్ని ఇండియాస్ టాప్ దర్శకుల్లో ఒకరైన మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి ఈ చిత్రాన్ని ఎట్టకేలకి రిలీజ్ కి తీసుకొస్తుండగా భారీ ప్రమోషన్స్ లో కూడా వారు బిజీగా ఉన్నారు. శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో ప్రీరిలీజ్ వేడుక చేశారు. ఇందుకు ప్ర‌ధాన తారాగ‌ణం పాల్గొన్నారు.
 
ఐశ్వ‌ర్య‌రాయ్ మాట్లాడుతూ, మ‌ణిర‌త్నం పెయింట్‌ను సృష్టించారు. ఆయ‌న క‌ల‌కు జీవితాన్నిచ్చే అవ‌కాశం మాకు ద‌క్క‌డం ఆనందంగా వుంది అన్నారు. త్రిష మాట్లాడుతూ, చోళ రాజ్య‌వంశానికి చెందిన క‌థ‌లో న‌టించ‌డం చెప్ప‌లేని ఆనందాన్నికలిగించింది. జాతీయ స్థాయి న‌టుల‌తో క‌లిసి న‌టించ‌డం మ‌రింత ఆనందంగా వుంద‌న్నారు.
 
చియాన్ విక్ర‌మ్‌, సుమ‌ల‌త, జ‌యంర‌వి మాట్లాడుతూ, మ‌ణిర‌త్నం సినిమాల్లో ఇదొక ఆణిముత్యం అని అభివ‌ర్ణించారు. ఈ సినిమా తెలుగులో ఈనెల 30న విడుద‌ల కాబోతుంది. తెలుగులో దిల్‌రాజు ఈ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. సుదాభాస్క‌ర‌న్ నిర్మాత‌.
 
కాగా, ఈ సినిమా  మొదటి భాగం రన్ టైం  167 నిమిషాల నిడివి వచ్చింద‌ని తెలుస్తోంది.  ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలు బోగీలపై నడిచిన యువకుడు - హైటెన్షన్ విద్యుత్ వైరు తగ్గి... (Video)

తండ్రి మృతదేహం వద్దే ప్రియురాలి మెడలో తాళికట్టిన యువకుడు (Video)

వధువు స్థానంలో తల్లి.. బిత్తరపోయిన వరుడు...

ప్రాణాలను కాపాడే రక్తదాన కార్యక్రమంలో ముందున్న కెఎల్‌హెచ్‌ ఎన్ఎస్ఎస్

andhra pradesh weather report today ఆంధ్ర ప్రదేశ్ రేణిగుంటలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

తర్వాతి కథనం
Show comments