Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

దేవీ
మంగళవారం, 15 ఏప్రియల్ 2025 (10:06 IST)
Sampat nandi, tamanna, sharva, madhu
తమన్నా భాటియా మూవీ 'ఓదెల 2'. సూపర్ నాచురల్ థ్రిల్లర్ 'ఓదెల రైల్వే స్టేషన్'కి సీక్వెల్ ఇది. సంపత్ నంది సూపర్ విజన్ లో అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్‌పై డి మధు నిర్మించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రలో కనిపించనున్నారు. హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చార్మింగ్ స్టార్ శర్వా చీఫ్ గెస్ట్ గా హాజరై ఇలా మాట్లాడారు.
 
శర్వా మాట్లాడుతూ, కొన్ని కొన్ని సినిమాలు ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ మంచి వాటంత అదే జరిగిపోతుంది. ఓదెల 2 టీజర్ చూడగానే అరుంధతి, అమ్మోరు సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. ఏదో మ్యాజిక్ జరగబోతుందనే ఫీలింగ్ నాకుంది. సంపత్ నంది గారితో ఏడాదిగా ట్రావెల్ చేస్తున్నాను ఆయన ఒక అడిక్షన్. తమన్నా గారు ఆయనతో నాలుగు సినిమాలు చేశారంటే మామూలు విషయం కాదు. తమన్నా గారిని హీరోయిన్ అని పిలవడం నాకు ఇష్టం లేదు తను వండర్ఫుల్ ఆర్టిస్ట్. రెండు దశాబ్దాలుగా హీరోయిన్ గా ఉండడం మామూలు విషయం కాదు. ఒక మాస్ సినిమాకి ఎలా అయితే ఆడియన్స్ వెయిట్ చేస్తారో ఈ సినిమా కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఓపెనింగ్స్ అదిరిపోతాయని ఎందుకో నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. కొన్ని సినిమాలు కి ఆడియన్స్  డెఫినెట్ గా చూడాలని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఓదెల 2 కూడా అలాంటి సినిమానే. ఈ సినిమాకి నేను వెళ్తాను. ఆడియన్స్ కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యారని నమ్ముతున్నాను. మధు గారికి టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా టీజర్ చూడగానే నాకు నచ్చింది సౌందర్ రాజన్ గారి విజువల్స్. మంచి సినిమా చేశారు. బ్లాక్ బస్టర్ కొట్టాలి. ఈ సమ్మర్ కి ఇదే బ్లాక్ బస్టర్ అవుతుందని నా నమ్మకం. విష్ యు ఆల్ ది బెస్ట్'అన్నారు.
 
తమన్నా భాటియా మాట్లాడుతూ, 20 ఏళ్లుగా ఎన్నో ప్రొడక్షన్స్ లో పనిచేశాను. కానీ ఇంత పాషన్ వున్న ప్రొడ్యూసర్, క్రియేటర్స్ చాలా అరుదుగా ఉంటారు. ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నాను. శివశక్తి పాత్ర, ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్ గా ఉండబోతుంది.17 ఏప్రిల్ కోసం చాలా ఈగర్ వెయిట్ చేస్తున్నాను. మధుగారు ఈ సినిమాని చాలా అద్భుతంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మించారు. ప్రతి ప్రమోషన్ మెమోరబుల్ గా చేశారు. ఈ ఈవెంట్ కొచ్చి మమ్మల్ని విష్ చేసిన శర్వానంద్ గారికి థాంక్యూ. శర్వానంద్‌, నేను ఎప్పుడూ మీట్‌ కాలేదు. ఆయనతో కలిసి నటించాలనుంది. శివశక్తి పాత్రను నాకు ఇచ్చినందుకు సంపత్‌, అశోక్‌ తేజకు కృతజ్ఞతలు. వశిష్ఠ అద్భుతంగా నటించారు. అజినిస్ గారు ఈ సినిమాకి సోల్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. మీ అందరి రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నాను'అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుప్రీం ఆదేశంతో వణికిపోయిన వీధి కుక్క, వచ్చేస్తున్నానంటూ ట్రైన్ ఎక్కేసింది: ట్విట్టర్‌లో Dogesh (video)

పోలీస్ యూనిఫాం ఇక్కడ.. కాల్చిపడేస్తా : వైకాపా కేడర్‌కు డీఎస్పీ మాస్ వార్నింగ్

తెలంగాణాలో భారీ వర్షం... ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

అమెరికాలో రోడ్డు ప్రమాదం - హైదరాబాద్ విద్యార్థిని దుర్మరణం

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లయింగ్ ఐసీయూ ఎయిర్ అంబులెన్స్‌ను ప్రారంభించాలని ICATT ప్రతిపాదన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

తర్వాతి కథనం
Show comments