జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (20:16 IST)
తన వ్యక్తిగత జీవితంపై సినీనటి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో తనకు నచ్చని అంశం కండిషన్స్ లేదా రూల్స్ (నియమ నిబంధనలు) అని చెప్పారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో సమంత వెకేషన్‌కు వెళ్లివున్నారు. అక్కడ జరుగుతున్న సిడ్నీ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా లైఫ్ నా ఇష్టంగా ఉంటానని, నేనిలాగే ఉంటానని చెప్పారు. నా జీవితంలో నాకు నచ్చని అంశం రూల్ అని తెలిపారు. 
 
సక్సెస్ అంట్ కేవలం గెలవడం మాత్రమే కాదని, ప్రయత్నించడం కూడా విజయానికి ముఖ్యమని సమంత అన్నారు. తనకు నచ్చినట్టు జీవించడమే నిజమైన సక్సెస్ అని ఆమె అభిప్రాయపడ్డారు. అవార్డులు, రివార్డులు మాత్రమే సక్సెస్ కాదని ఆమె స్పష్టం చేశారు. 
 
"నా జీవితంలో నాకు నచ్చినట్టు బతకాలని అనుకుంటాను. నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవు. నాకు ఇష్టమైన రంగంలో రాణించాలనుకున్నదే నా కోరిక. ఆడపిల్ల కాబట్టి ఇది చేయకూడదు, అది చేయకూడదు అని ఆంక్షలు విధిస్తే నాకు నచ్చదన్నారు. జీవితంలో అన్ని రకాల పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించాలనేదే నా లక్ష్యం" అని అన్నారు. సిడ్నీ పర్యటన సందర్భంగా అక్కడి యువతతో ఆమె ముచ్చటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

యుద్ధంలో భారత్‌ను ఓడించలేని పాకిస్తాన్ ఉగ్రదాడులకు కుట్ర : దేవేంద్ర ఫడ్నవిస్

మెట్రో రైల్ ఆలస్యమైనా ప్రయాణికులపై చార్జీల బాదుడు... ఎక్కడ?

హెటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో క్షణాల్లో దగ్ధమైపోయిన బస్సు

ఫరిదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్‌లో ఉన్నత విద్యావంతులే కీలక భాగస్వాములు...

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments