Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చైతన్య ఎవడో నాకు తెలియదు.. నా పేరుతో మోసం చేస్తే నమ్మకండి.. సునీత

Webdunia
మంగళవారం, 28 జులై 2020 (08:40 IST)
ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత మళ్లీ వార్తల్లో నిలిచారు. తన పేరును ఉపయోగించుకుని ఓ వ్యక్తి మోసాలకు పాల్పడుతున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. చైతన్య పేరిట తనకు మేనల్లుడిని అంటూ ప్రచారం చేసుకుంటూ.. కొందరి నుంచి డబ్బులు వసూళ్లు చేస్తున్నాడని తెలిపారు. ఈ విషయాన్ని సునీత సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 
 
ఇంతటి మోసానికి పాల్పడుతున్న చైతన్య అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని సునీత స్పష్టం చేశారు. సెలబ్రేటీల పేరు చెప్పగానే ఎలా డబ్బులు ఇస్తారని.. ప్రతి రోజు మీడియాలో ఇలాంటి వార్తలు వస్తున్నా.. ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అయినా కూడా ఎందుకు అలాంటివారిని నమ్ముతారు అంటూ సునీత అసహనం వ్యక్తం చేశారు. 
 
ఇప్పటి వరకు తను చైతన్య అనే వక్తిని కలవను కూడా కలవలేదని స్పష్టం చేశారు. చైతన్య తన పేరు ఉపయోగించుకుని అమాయకులను మోసం చేస్తున్నట్లుగా తెలిసిందన్నారు. తనకు చైతన్య అనే అల్లుడు ఎవరూ లేరంటూ ఫేస్ బుక్‌లో విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భర్తను నరికి చంపేసిన ఇద్దరు భార్యలు.. కారణం ఏంటో తెలుసా?

Hyderabad: కల్లు కాంపౌండ్ వద్ద ఆరేళ్ల బాలిక కిడ్నాప్.. సీసీటీవీ కెమెరాలో..? (video)

ప్రేమ వ్యవహారంలో యువతి హత్య - పక్కనే కొన ఊపిరితో ప్రియుడి...

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్ల అని తెలిస్తే చాలు.. అబార్షన్... వైద్యుడి నిర్వాకం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments