Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు సర్‌తో నేను నటించడంలేదు, బాంబు పేల్చిన త్రిష

Webdunia
శుక్రవారం, 13 మార్చి 2020 (21:22 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ చిరు వెంట ఆచార్య తను నటించడం లేదంటే త్రిష బాంబు పేల్చింది. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కథ చెప్పినప్పుడు ఒక రకంగా ఆ తర్వాత మరో రకంగా పాత్రలు మారుతుంటాయనీ, ఏమైనప్పటికీ చిరు సర్ చిత్రం నుంచి తను తప్పుకుంటున్నట్లు ప్రకటించింది త్రిష.
 
ఈ నేపధ్యంలో చిరంజీవి సరసన ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి వుంది. ఆచార్య చిత్రానికి బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఇటీవల రాజమండ్రి షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత రామోజీ ఫిలింసిటీలో చిరంజీవిపై ప్రస్తుతం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో చిరంజీవి దేవాదాయ శాఖలో పని చేసే ఉద్యోగిగా నటిస్తున్నారని సమాచారం.
 
అయితే... ఇందులో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా 40 రోజులు డేట్స్‌కు గాను 40 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది. మరోవైపు మహేష్ బాబుతో అనుకున్నప్పటికీ మళ్లీ ఆ పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ తోనే చేయించడానికి ప్లాన్ చేస్తున్నట్టు మరో వార్త బయటకు వచ్చింది. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుమల బాల గంగమ్మ ఆలయం వద్ద చిరుత సంచారం.. పిల్లి చిక్కలేదు (video)

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం : గాల్లో కలిసి ముగ్గురి ప్రాణాలు

Bhadradri: హైటెన్షన్ విద్యుత్ తీగలు బైక్‌కు తగిలి ఓ వ్యక్తి సజీవ దహనం.. ఎక్కడ?

భారత్‌పై పన్నుల మోత మోగిస్తాం : డోనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

'బిగ్ బాస్‌'‍ ఛాన్స్ పేరుతో వైద్యుడికి కుచ్చుటోపీ - రూ.10 లక్షలు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments