Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహేష్ బాబు...

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (14:13 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ఈ వైరస్ దేశ ప్రజలతో పాటు.. ప్రభుత్వాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్య భ‌యాందోళ‌న‌ను రేకెత్తిస్తోంది. మే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుంద‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రజలు మరింతగా ఆందోలన చెందుతున్నారు. 
 
ఇదిలావుంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంద‌న్న ఒక్క వార్తే ఇప్పుడు అంద‌రినీ ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. అయితే కొంద‌రిలో వ్యాక్సిన్‌పై అనుమానాలున్న నేప‌థ్యంలో సెల‌బ్రిటీలు సైతం వ్యాక్సినేష‌న్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. 
 
తాము వ్యాక్సిన్ తీసుకున్న విష‌యాన్ని ప్ర‌పంచంతో పంచుకుంటూ వ్యాక్సిన్‌పై అపోహ‌ల‌ను తొలిగించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. 
 
ట్వీట్ చేస్తూ.. “నేను కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాను. ద‌య‌చేసి మీరు కూడా వ్యాక్సినేష‌న్ చేయించుకోండి. క‌రోనా సెకండ్ వేవ్ అంద‌రినీ చాలా బ‌లంగా తాకుతోంది. దీనిని వ్యాక్సినేష‌న్‌తోనే అడ్డుకోగ‌లం. 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోవ‌డానికి అర్హ‌త ఉన్న వారందరూ మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోండి. అంద‌రూ జాగ్ర‌త్త‌గా ఉండండి” అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments