Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాదంలో ‘భీమ్లా నాయక్’ పాట.. వేరే పదాలు దొరకలేదా?

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (13:12 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న విడుదలైన టైటిల్ సాంగ్‌పై వివాదం రాజుకుంది. ఈ పాట పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేయగా.. తెలంగాణ పోలీసులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పాట విడుదలైన 22 గంటల్లోనే 8 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్ నంబర్-1 గా ఉంది.
 
‘భీమ్లా నాయక్’ అంటూ సాగే ఈ పాటలో జానపద గాయకుడు, కిన్నెర మెట్ల వాయిద్యకారుడు దర్శనం మొగిలియ్య పాడిన మొదటి చరణాలు పాటకే హైలెట్‌గా చెప్పొచ్చు. మధ్యలో మరో ప్రముఖ సింగర్ రామ్ మిరియాల గానం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
 
అయితే ఈ పాటపై తెలంగాణ పోలీసుల నుంచి అభ్యంతరం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ, ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటలోని లిరిక్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ట‌లో ఈ పాటపై స్పందించారు.
 
‘తెలంగాణ పోలీసులు పీపుల్ ఫ్రెండ్లీ.. మేము ఎవరి రక్షణ కోసమైతే తాము జీతాలు తీసుకుంటున్నామో.. వారి బొక్కలు తాము విరగ్గొట్టం.. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రికి పోలీసుల ఛరిష్మాను వర్ణించేందుకు ఇంతకుమించిన పదాలు దొరక్కపోవడం ఆశ్చర్యకరం. పోలీసుల సేవలు ఇందులో ఎక్కడ పేర్కొనలేదు’ అని ఐపీఎస్ రమేశ్ భీమ్లా నాయక్ పాటపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం రాజుకుంది.
 
భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ లో ‘చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క’..ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస’ అంటూ పోలీసుల ప్రతాపం వర్ణించే విషయంలో రైటర్ రామజోగయ్య కాస్త అతిగా పదాలు వాడినట్టుగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments