Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాడీ బిల్డర్‌నే అవాక్కయ్యేలా చేసిన ప్రభాస్ అంకితభావం: నాలుగేళ్ల పాటు బాహుబలి శరీర యజ్ఞం

నాలుగేళ్లపాటు ఒకే సినిమాకు సైన్ చేయడం గొప్ప కాదు. అందుకు గానూ భారీ రెమ్యునరేషన్‌ తీసుకోవడమూ గొప్ప కాదు. కానీ పాత్ర ఆదేశించిన దాని ప్రకారం నాలుగేళ్లపాటు ఇష్టమైన ఆహారాన్ని త్యజించి, అత్యంత కఠినమైన డైట్‌ను పాటించి ఒక సినిమాకోసం శరీర యజ్ఞాన్నే పాటించి ని

Webdunia
మంగళవారం, 21 మార్చి 2017 (07:48 IST)
నాలుగేళ్లపాటు ఒకే సినిమాకు సైన్ చేయడం గొప్ప కాదు. అందుకు గానూ భారీ రెమ్యునరేషన్‌ తీసుకోవడమూ గొప్ప కాదు. కానీ పాత్ర ఆదేశించిన దాని ప్రకారం నాలుగేళ్లపాటు ఇష్టమైన ఆహారాన్ని త్యజించి, అత్యంత కఠినమైన డైట్‌ను పాటించి ఒక సినిమాకోసం శరీర యజ్ఞాన్నే పాటించి నిష్టగా పూర్తి చేయడం భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే కాదు. ప్రపంచ సినీ చరిత్రలో ఎవరికైనా సాధ్యపడిందా. ప్రభాస్ గొప్పతనం ఇక్కడే ఉంది. బాహుబలి సినిమా కోసం తనకెంతో ఇష్టమైన బిర్యానీ అపేయమంటే ఆపేశాడు. ఆరుసార్లు ఆహారం ఇస్తే కిమ్మనకుండా తిన్నాడు. బాహుబలి 2 కోసం రోజుకు 8 సార్లు చీస్, మటన్ ఇస్తే దాన్నీ ఆరగించాడు. తన శరీక పర్యవేక్షకులపై ఎంతో నమ్మకం లేకుంటే కానీ ఇలాంటి ఫీట్స్ సాధ్యం కాదు. అందుకే ఒక్కమాటలో చెప్పవచ్చు. బాహుబలి ప్రభాస్‌ను తీర్చిదిద్దితే ప్రభాస్ బాహుబలిని తీర్చి దిద్దాడు. అనితర సాధ్యమైన ఉక్కు క్రమశిక్షణతో... బాహుబలిపై అపారమైన విశ్వాసంతో.. నాలుగేళ్లు తన శరీర యజ్ఞాన్ని ప్రభాస్ ఎలా సాగించాడో తన బాడీ బిల్డర్ మాటల్లోనే విందాం.
 
ప్రపంచ వ్యాప్తంగా మరో నెల రోజుల్లో విడుదల కానున్న చిత్రం బాహుబలి-2. ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోగా నటించిన ప్రభాస్‌ ద్విపాత్రాభినయం చేసిన విషయం అందరికీ తెలిసిందే. తండ్రి పాత్రలో అమరేంద్ర బాహుబలిగా, కొడుకు పాత్రలో మహేంద్రబాహుబలిగా చాలా అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా రెండు విభిన్నపాత్రలకు తగినట్లుగా శరీరాకృతిని దాదాపు నాలుగేళ్లపాటు అత్యంత జాగ్రత్తతో కాపాడుకున్నాడు.
 
ఎంతలా అంటే ఆయనకు ప్రత్యేక ఫిజికల్‌ ట్రైనర్‌గా పనిచేసిన బాడీ బిల్డర్‌ లక్ష్మణ్‌రెడ్డి అవాక్కయ్యేలాగా. ప్రభాస్‌కున్న అంకిత భావాన్ని చూసి ఆయన కూడా ఆశ్చర్యానికి లోనయ్యారంట. ప్రభాస్‌ డెడికేషన్‌ అమేజింగ్‌ అంటూ ఆయన ఓ మీడియాకు చెప్పారు. అమరేంద్ర బాహుబలికోసం ప్రభాస్‌ 100 కేజీలు పెరిగిన ప్రభాస్‌ శివుడి(మహేంద్ర బాహుబలి) పాత్రకు తగినట్లుగా మారేందుకు కూడా అమితంగా కష్టపడ్డాడని తెలిపారు.
 
ఎగ్‌ వైట్స్‌, చికెన్‌, నట్స్‌, అల్మాండ్స్‌, చేపలు, కూరగాయలు వంటివాటితో బాహుబలి 1 పాత్రకోసం ఆరుసార్లు ఆహారంగా ఇచ్చామని, బాహుబలి-2 పాత్రకోసం చీస్‌, మటన్‌ దాదాపు ఎనిమిదిసార్లు ఇచ్చామని చెప్పారు. ప్రభాస్‌కు బిర్యాని అంటే చాలా ఇష్టం అని, జంక్‌ ఫుడ్‌ అంటే కూడా నచ్చుతుందని ఈ విషయంలో తాను చాలా కఠినంగా ఉండేవాడినని, అయితే, అతడి ఇష్టాన్ని అర్థం చేసుకొని అనుమతిచ్చేవాడినని పేర్కొన్నారు. ప్రభాస్‌ తీసుకునే ఆహారం, వర్కవుట్స్‌ అన్నీ కూడా దాదాపు నాలుగేళ్లపాటు తన పర్యవేక్షణలోనే జరిగాయని వివరించారు.
 

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

తెలంగాణలో వర్షాలు.. అంటువ్యాధులతో జాగ్రత్త.. సూచనలు

ఏపీలో పోలింగ్ తర్వాత తిరుమలకు రేవంత్ రెడ్డి

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments