Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్‌ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా.. విడిపోవడానికి కూడా అదే కారణం: అమలాపాల్

కోలీవుడ్‌లో బ్యూటీఫుల్ జోడీగా పేరు కొట్టేసిన అమలాపాల్- విజయ్ జోడీ విడాకులు తీసుకుంది. అమలాపాల్ వివాహం జీవితానికి అతి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టేయడం.. సినిమాల వైపు దృష్టి మళ్లించడం జరిగిపోయింది. అయితే

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2016 (13:43 IST)
కోలీవుడ్‌లో బ్యూటీఫుల్ జోడీగా పేరు కొట్టేసిన అమలాపాల్- విజయ్ జోడీ విడాకులు తీసుకుంది. అమలాపాల్ వివాహం జీవితానికి అతి త్వరలోనే ఫుల్ స్టాప్ పెట్టేయడం.. సినిమాల వైపు దృష్టి మళ్లించడం జరిగిపోయింది. అయితే విడాకులు పొందిన తర్వాత కూడా తన భర్తంటే తనకెంతో ఇష్టమని అమలా పాల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. తన మాజీ భర్త ఎ.ఎల్‌. విజయ్‌ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటానని క్లారిటీ ఇచ్చింది. 
 
తన భర్త తనకు మంచి స్నేహితుడు, భర్త, ప్రియుడుగా, తండ్రిగా ఎంతగానో సహకరించాడని.. అమలా పాల్ తెలిపింది. 18 ఏళ్లప్పుడు నట జీవితాన్ని మొదలుపెట్టానని, 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నానని చెప్పారు. నిర్ణయాలు తీసుకోవడానికి అది సరైన వయసు కాదని అభిప్రాయపడ్డారు. తనను ఎవరూ గైడ్‌ చేయలేదని, తప్పుల నుంచీ జీవితాన్ని నేర్చుకున్నానని తెలిపారు. 
 
తాను విజయ్‌ని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని, అతడికి దూరం కావడానికి కారణం కూడా అదేనని వెల్లడించారు. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాకుండా ఛాలెంజింగ్ రోల్స్ పోషించడంపై దృష్టి సారిస్తున్నానని చెప్పారు. కాగా ప్రస్తుతం అమలా పాల్ ధనుష్‌ సరసన 'వడ చెన్నై', 'విఐపీ 2' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా మరో తమిళ, మలయాళ చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments