Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెజాన్ ప్రైమ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న హనీమూన్ ఎక్స్‌ప్రెస్

డీవీ
సోమవారం, 16 సెప్టెంబరు 2024 (15:30 IST)
Chaitanya Rao, Hebba Patel
కొన్ని సార్లు థియేటర్లో మిస్ అయిన చిత్రాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ వచ్చేస్తుంటుంది. ప్రస్తుతం చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీలో దూసుకెళ్తోంది. చైతన్య రావ్ ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్ ముందుకు వస్తుంటారు. ఈ క్రమంలో రీసెంట్‌గా వచ్చిన హనీమూన్ ఎక్స్‌ప్రెస్‌కి థియేటర్లోనూ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. చైతన్య రావ్, హెబ్బా పటేల్‌ల జంటకు నటన, కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి.
 
‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’ను కేకేఆర్, బాల రాజ్ నిర్మించగా.. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించిన సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సిస్ట్లా వీఎంకే కెమెరా పనితనానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీకి థియేటర్లో ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో.. ఓటీటీలో అంతకు మించిన రెస్పాన్స్ వస్తోంది. బిగ్ ఫిష్ సినిమాస్ ద్వారా ఈ మూవీ నేటి (ఆగస్ట్ 27) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.
 
అమెజాన్‌లో ఈ మూవీ ఇప్పుడు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ని సైతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తరం ఎదుర్కొంటోన్న ప్రేమ, పెళ్లి, విడాకులు అనే కాన్సెప్టుల మీద అందరినీ ఆకట్టుకునేలా, అందరినీ మెప్పించేలా తీసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం కట్టి పడేస్తోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి 40 మిలియన్ల మినిట్స్ వ్యూస్ వచ్చాయి. మున్ముందు ఈ చిత్రం ఇంకెంత మందిని ఆకట్టుకుని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. విజయవాడ మెట్రోకు టెండర్లు

ఉప్పల్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా గుండెపోటు.. 25ఏళ్ల వ్యక్తి మృతి.. ఆయన ఎవరు? (Video)

పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మన దేశ ఉగ్రవాదులా? చిదంబరం వివాదాస్పద వ్యాఖ్యలు

హైదరాబాదులో రేవ్ పార్టీని చేధించిన EAGLE.. తొమ్మిది మంది అరెస్ట్

Jagan: సెంట్రల్ జైలుకు వెళ్లనున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments