హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

ఠాగూర్
గురువారం, 31 జులై 2025 (12:05 IST)
హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి నందనీ కశ్యప్‌ను గౌహతి పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించినట్టు ట్రాఫిక్ విభాగం డీసీపీ జయంత సారధి వెల్లడించారు. 
 
తన కారుతో ఓ స్టూడెంట్‌ను ఢీ కొట్టి, అక్కడి నుంచి పారిపోయారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మంగళవారం రాత్రి మరణించాడు.
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిని కారు ఈ నెల 25వ తేదీన తెల్లవారుజామున 3 గంటలకు దఖింగావ్‌లో విద్యార్ధి సమియుల్ సమియుల్ హక్ను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారును నందినే డ్రైవ్ చేసింది. ప్రమాదంలో సమియులు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో అక్కడ పనిచేస్తున్న కొందరు నటి కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆమె ఆపలేదు.
 
చివరకు కపిలిపారాలోని ఓ అపార్టుమెంట్‌ వద్ద కారును గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నందిని కారును సీజ్ చేశారు. ఆమెను విచారించగా తన ప్రమేయం లేదని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఫ్లైఓవర్ పైనుంచి కారు వెళ్తుండగా డ్రైవర్‌కు గుండెపోటు

పోలవరం ప్రాజెక్టును సందర్శించిన కేంద్ర జల సంఘం బృందం

బేగంపేట ఎయిర్‌పోర్టులో మహిళా పైలెట్‌పై అత్యాచారం

పోలీసుల ముందు లొంగిపోనున్న 37మంది మావోయిస్టులు

Girl friend: ప్రియురాలి కోసం ఆత్మహత్యాయత్నం.. భార్యే ఆస్పత్రిలో చేర్చింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments