ఆస్కార్ వేదికపై చరిత్ర సృష్టించిన తెలుగోడి పాట - "నాటు నాటు"కు అవార్డు

Webdunia
సోమవారం, 13 మార్చి 2023 (09:05 IST)
తెలుగు చిత్రపరిశ్రమ ఆస్కార్ వేదికపై చరిత్ర సృష్టించింది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట ఆస్కార్ వేదికపై మెరిసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాటకు ఆస్కార్ 2023 అవార్డు వర్చింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో హాలీవుడ్ చిత్రాల్లోని పాటలతో ఈ పాట పోటీపడి అవార్డును దక్కించుకుంది. 
 
ముఖ్యంగా, నాటు నాటు పాటకు ఆది నుంచి గట్టి పోటీ ఇచ్చిన హాలీవుడ్ చిత్రాల్లోని పాటల్లో "టెల్ ఇట్ లైక్ ఎ విమెన్" సినిమాలో 'అప్లాజ్', "బ్లాక్ పాంథర్: వకాండా ఫరెవర్" సినిమాలోని 'లిఫ్ట్ మి అప్', "ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్" సినిమాలోని 'దిస్ ఈజ్ లైఫ్', "టాప్ గన్ మావెరిక్" సినిమాలో 'హోల్డ్ మై హ్యాండ్' పాటలను వెనక్కి నెట్టి మరీ 'నాటునాటు' పాట ఆస్కార్ దక్కించుకుంది.
 
'నాటునాటు' పాటకు సాహిత్యాన్ని చంద్రబోస్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించారు. 'ఆర్ఆర్ఆర్' 2022 మార్చి 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఈ సినిమా అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. ఈ పాటకు వారు చేసిన డ్యాన్స్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయింది. 
 
అదేవిధంగా తెలుగు సినిమా పాట ఆస్కార్‌కు నామినేట్ కావడం, అవార్డు దక్కించుకోవడం ఇదే తొలిసారి. దీంతో తెలుగోడు గర్వంతో తలెత్తుకుంటున్నాడు. టాలీవుడ్‌లో అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. దర్శక దిగ్గజం రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌, ఇతర చిత్రబృందానికి శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాట నిలబెట్టుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం - డీఏ విడుదల చేసిన సర్కారు

ఇద్దరు పిల్లల తల్లి... భర్త మేనల్లుడితో అక్రమ సంబంధం... ఇక వద్దని చెప్పడంతో...

దీపావళి గిఫ్ట్‌గా ఉద్యోగులకు లగ్జరీ కార్లు బహుకరించిన యజమాని.. (Video)

ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుక

'రీల్ మినిస్టర్ - 12 వేల రైళ్లు ఎక్కడ' అంటూ కాంగ్రెస్ ట్వీట్‌కు రైల్వేశాఖ స్ట్రాంగ్ కౌంటర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments