స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - రష్మిక మందన్నా జంటగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం "పుష్ప". ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం రాత్రి విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను చూసిన అనేక మంది సినీ సెలెబ్రిటీలు తమ స్పందనను తెలియజేస్తున్నారు. ఇలాంటి వారిలో హీరోయిన్ సమంత కూడా ఉన్నారు.
ఈమె 'పుష్ప' ట్రైలర్‌పై చేసిన ట్వీట్ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. "పుష్పరాజ్.. తగ్గేదే లే" అంటూ పుష్ప ట్రైలర్‌కు ఆమె రీట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై అక్కినేని - సమంతలకు చెందిన ఉమ్మడి ఫ్యాన్స్ మాత్రం డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు.