Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరదతో హన్సిక కష్టాలు.. గంటపాటు మోకాలు లోతు నీళ్లలోనే..?!

Webdunia
బుధవారం, 25 నవంబరు 2015 (15:31 IST)
బాలీవుడ్‌లో బాలతారగా ఎంట్రీ ఇచ్చి.. దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా నిలిచింది. టాప్ హీరోలతో నటించిన ఈ భామ.. వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. హీరో విజయ్‌తో పులిలో కనిపించిన హన్సిక తన అందాలతో అదరగొట్టేసింది.  తాజాగా ఉదయనిధి స్టాలిన్ సరసన జాలీ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబాయి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ముంబైలో భారీ వర్షాలు కురవడంతో.. ఆ ప్రాంతంలో వరదలు ముంచెత్తాయి. 
 
ఇప్పుడు అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ ఊహించని విధంగా వరదలు ముంచెత్తాయి. నగరం అల్లకల్లోమైన పరిస్థితి.. అనుకోని ఘటనతో అందరూ టెన్షన్ పడ్డారు. ఇక హన్సిక పరిస్థితి మరీ దారుణం. ఒక రోజు మొత్తం వరద నీటిలోనే ఇరుక్కుపోయారు. మోకాళ్ల లోతు నీటిలో కనీసం గంట పాటు సుదీర్ఘంగా నడక సాగించాల్సొచ్చింది. జాలీ ఎల్ ఎల్‌బి షూటింగ్ ముగించుకొని తన వ్యక్తిగత సిబ్బందితో తిరుగు ప్రయాణమైనారు. ఇక మార్గ మధ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇకపోతే ముందుకు వెళ్లలేక వెనక్కి వెళ్లలేక మధ్యలోనే చిక్కుకుపోయింది. 
        
ఏం చేయాలో పాలుపోని హనీ కాసేపు ఫోన్‌లో తనవారికి ప్రొడక్షన్ టీమ్‌కి కాల్ చేయాలని ప్రయత్నించింది. కానీ అసలు సిగ్నల్ అన్నదే కనెక్టవ్వలేదు. పైగా కార్ దిగి ఎటైనా నడిచి వెళ్లిపోదామంటే మోకాళ్ల లోతు నీటిలో దిగాల్సిన పరిస్థితి. తనకి పార్క్ హయత్‌లో రూమ్ కేటాయించారు. ఆ హోటల్‌కు చేరుకోవాలంటే గంటపాటు నీటిలో నడవాల్సిందే. అయితే కారు దిగిన హన్సిక.. ఏదోలా రోడ్డుపై నడుచుకుంటూ వేరొక హోటల్‌కి వెళ్లాలనుకుని కారు దిగి.. వ్యక్తిగత స్టాఫ్‌తో కలిసి ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్‌కి చేరుకుంది. బతుకు జీవుడా అంటూ బయటపడింది. 

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments