తెలుగులో మేఘా ఆకాష్.. అఖిల్ రెండో సినిమాకు హీరోయిన్‌గా ఖరారు..
వెండితెరపైకి చాలా వేగంగా దూసుకువస్తోన్న కథానాయికగా మేఘా ఆకాష్ పేరు వినిపిస్తోంది. తమిళంలో ఓ సినిమాలో నటిస్తుండగానే ఆమె గ్లామర్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా విడుదల కాకమునుపే అమ్మాయికి మంచి
వెండితెరపైకి చాలా వేగంగా దూసుకువస్తోన్న కథానాయికగా మేఘా ఆకాష్ పేరు వినిపిస్తోంది. తమిళంలో ఓ సినిమాలో నటిస్తుండగానే ఆమె గ్లామర్ గురించి జోరుగా చర్చ సాగుతోంది. ఈ సినిమా విడుదల కాకమునుపే అమ్మాయికి మంచి పేరు వచ్చేసింది. దాంతో ధనుష్‌తో తాను చేసే సినిమా కోసం ఆమెను కథానాయికగా గౌతమ్ మీనన్ ఎంపిక చేశాడు.
ఈ నేపథ్యంలోనే ఈ అమ్మాయి గురించిన విషయాలు తెలుగు ఇండస్ట్రీకి చేరిపోయాయి. ఫలితంగా హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ హీరోగా చేస్తోన్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక అఖిల్ రెండవ సినిమాలో కథానాయిక కోసం కూడా ఈ అమ్మాయినే సంప్రదిస్తున్నారనేది తాజా సమాచారం. 'మనం' దర్శకుడు విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దాదాపు ఈ అమ్మాయినే ఖరారు చేయవచ్చని సమాచారం.