Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓట్ల‌తో ఓడినా విలువ‌ల‌తో గెలిచిన హీరోలు!

Webdunia
సోమవారం, 3 మే 2021 (13:49 IST)
pavan, kamal
ఈ ఫొటో చూశారా, ఇందులో ఇద్ద‌రూ సినిమా క‌థానాయ‌కులు. ఎల‌క్ష‌న్ల‌లో ఇద్ద‌రూ నిల‌బ‌డ్డారు. ఇద్ద‌రూ ఓడిపోయారు. ఇద్ద‌రికీ ఒకే సారూప్య‌త వుంది. ఇద్ద‌రు కూడా డ‌బ్బులిచ్చి ఓట్లు కొన‌మ‌ని ఖ‌రాఖండిగా ఎన్నిక‌ల సంద‌ర్భంగా చెప్పిన‌వారే. అవినీతిని, త‌ప్పుల్ని ప్ర‌శ్నించాల‌ని ఎలుగెత్తి చాటిన‌వారే. అలాంటి వారు ఎన్నికల్లో ఓడినా విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి గెలిచారు. ఒక‌రు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌రొక‌రు క‌మ‌ల్ హాస‌న్‌. తెలుగులో ఇద్ద‌రు పేర్లు రాస్తే ఆరు అక్ష‌రాలే వుంటాయి. వారి ఆలోచ‌న‌లు ఒకేలా వుంటాయ‌న్న‌మాట‌.
 
ఇదిలా వుండ‌గా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ వీరాభిమాని ఇలా వీరిగురించి రాసి పోస్ట్ చేశాడు. ఇందుకు ఆయ‌న అభిమానుల‌తోపాటు చిరంజీవి అభిమానులు కూడా ఫిదా అయ్యారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న సోష‌ల్‌మీడియాలో పంచుకున్నారు. ఇద్ద‌రు హీరోలు జీరో బ‌డ్జెట్‌తో రాజ‌కీయాల్లో పాల్గొని రెండు రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా నిలిచార‌ని పేర్కొన్నారు.

గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఎన్నిక్ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ త‌ర‌ఫున ఒకే ఒక వ్య‌క్తి గెలిచాడు. కానీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓడిపోయాడు. కానీ క‌మ‌ల్ పార్టీలో ఒక్క‌రూ గెల‌వ‌లేదు. ఒక‌ప్పుడు సినిమా హీరోలు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీని అరిక‌ట్టి గెలిచారు. అందుకు ఎన్‌.టి.ఆర్‌. ఆద‌ర్శం. కానీ రానురాను రాజ‌కీయ నాయ‌కులు పోక‌డ‌లు మార‌డంతో సీన్ రివ‌ర్స్ అయింది. మ‌ర‌లా ఆ రోజులు ఎప్పుడు వ‌స్తాయో అని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తోడుకోసం ఆశపడి రూ.6.5 కోట్లు పోగొట్టుకున్న యూపీవాసి!

మడకశిరలో విషాదం : బంగారం వ్యాపారం కుటుంబ ఆత్మహత్య

ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలి : నితిన్ గడ్కరీ!

మయన్మార్ భూకంప తీవ్రత... 334 అణుబాంబుల విస్ఫోటనంతో సమానం!!

కోడిగుడ్లు అమ్ముకునే వ్యాపారి బిజెనెస్ రూ.50 కోట్లు.. జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments