హీరో యష్ పూరి కి హ్యాపీ ఎండింగ్ కానుందా!

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2023 (11:33 IST)
Yash Puri, Happy Ending, Apoorva Rao
చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం వంటి సినిమాలతో పేరు తెచ్చుకున్నారు యష్ పూరి. ఆయన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా హ్యాపీ ఎండింగ్. ఈ చిత్రంలో అపూర్వ రావ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ రాగా...ఇప్పుడు మరో బ్యూటిఫుల్ మెలొడీ 'నగుమోము..' లిరికల్ సాంగ్ ను ఇటీవలే విడుదల చేశారు.
 
లవ్ ఫీలింగ్స్ తో హృదయాల్ని తాకేలా నగుమోము పాటను చిత్రీకరించారు. సంగీత దర్శకుడు నిడమర్తి రవి అందించిన బ్యూటిఫుల్ ట్యూన్ కు లక్ష్మీ ప్రియాంక సాహిత్యాన్ని రాయగా.. కృష్ణ తేజస్వి  పాడింది. నగుమోము కనగానే నాలోన మెరుపే మెరిసే విరిసే ..అంటూ ప్లెజంట్ కంపోజిషన్ తో పాట సాగింది. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న హ్యాపీ ఎండింగ్ మూవీని త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
 
అజయ్ ఘోష్, విష్ణు, ఝాన్సీ, అనిత చౌదరి, హర్ష్ రోషన్, జియ శర్మ, వంశీ నెక్కంటి, కేఎంఎమ్ మణి, కమల్ తుము, శ్వేత తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం - రవి నిడమర్తి, సినిమాటోగ్రఫీ- అశోక్ సీపల్లి, ఎడిటర్ - ప్రదీప్ ఆర్ మోరమ్, స్క్రీన్ ప్లే - నాగసాయి, లైన్ ప్రొడ్యూసర్ - ప్రసాద్ బిల్లకుర్తి, పీఆర్వో - జీఎస్కే మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కిరణ్ రామానుజం, ప్రొడ్యూసర్స్ - యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల , స్టోరీ డైరెక్షన్ - కౌశిక్ భీమిడి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో వింత వ్యాధి : చిన్నారి శరీరమంతా బొబ్బలే (వీడియో)

#JEEMain2026 షెడ్యూల్ రిలీజ్... జనవరి నెలలో మెయిన్స్ పరీక్షలు

రూ.2 కోట్లు ఎదురు కట్నమిచ్చి 24 యేళ్ల యువతిని పెళ్లాడిన 74 యేళ్ల తాత!!

ఒకే వేదికపై ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్న యువకుడు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments