Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఎస్‌4"కు ఐదేళ్ళు పడుతుంది.. హీరో సూర్య

సింగం సిరీస్‌లో మూడు భాగాలు చేసి హ్యాట్రిక్‌ సాధించాను. నాలుగో భాగాన్ని ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. అందుకు ఐదేళ్ళు పడుతుందని హీరో సూర్య అంటున్నాడు. "సి‌3".. తమిళ సినిమా సినిమా 'సింగం3'గా తెలుగులో

Webdunia
మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (20:14 IST)
సింగం సిరీస్‌లో మూడు భాగాలు చేసి హ్యాట్రిక్‌ సాధించాను. నాలుగో భాగాన్ని ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. అందుకు ఐదేళ్ళు పడుతుందని హీరో సూర్య అంటున్నాడు. "సి‌3".. తమిళ సినిమా సినిమా 'సింగం3'గా తెలుగులో విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌ విచ్చేసిన సూర్య పలు విషయాలను తెలియజేశారు. 
 
నా కెరీర్‌లో ఎంతో ప్రధాన్యం వహించిన చిత్రమిది. పండుగ సీజన్‌లో విడుదలకాకపోయినా ఇంత పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారంటే అంతకంటే ఆనందం ఇంకేమీ లేదు. ఇటు తెలుగునాటే కాదు అటు తమిళనాడు కూడా మంచి కలెక్షన్లతో చిత్రం దూసుకుపోతోంది. నిర్మాతలతోపాటు చిత్రాన్ని తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎంతో ఆనందంగా ఉన్నారు. అలాగే సినిమాను చూసిన ప్రేక్షకులు క్రిటిక్స్‌ కూడా పాజిటివ్‌గా స్పందించారు. 
 
నీతి నిజాయితీలతో పనిచేస్తున్న పోలీసులను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన చిత్రమిది. అందుకే పోలీసులు కూడా ఈ చిత్రాన్ని తమదిగా భావిస్తున్నారు. ఇప్పటికి హ్యాట్రిక్‌ సాధించాను. పాత్ర పరంగా ఎక్కడ ఎంత టెంపో ఉండాలో అక్కడ అంత టెంపోను పెట్టి దర్శకుడు హరి ఈ విజయంలో కీలక పాత్ర వహించారు. పాత్రకు అనుగుణంగా వెజిటేరియన్‌ను మాత్రమే తిన్నాను. 
 
అందుకు దర్శకుడు ఇచ్చిన శిక్షణ మర్చిపోలేనిది. చిత్రం చూశాక నాన్నగారు నన్ను హత్తుకుని.. మంచి సినిమా తీశాని మెచ్చుకోవడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. తెలుగులో శివకుమార్‌ లాంటి నిర్మాత చక్కటి పబ్లిసిటీతో అందరికి చేరువయ్యేలా చేశారని తెలిపారు. తదుపరి చిత్రాల గురించి చెబుతూ.. విఘ్నేష్‌శివన్‌ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నానని తెలిపారు. 
 
దర్శకుడు హరి మాట్లాడుతూ ఈ చిత్రానికి కొనసాగింపుగా ఎస్‌-4 చిత్రం తీసే ఆలోచన ఉన్నప్పటికీ ఐదేళ్ళ తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. ఈలోగా సూర్య, నా కాంబినేషన్‌లో వేరొక చిత్రం వుంది. ప్రస్తుతం నేను 'సామి-2' చిత్రం చేయబోతున్నాను' అని చెప్పారు. 

పోలీస్ ఏసీపీ నివాసంలో ఏసీబీ సోదాలు.. ఆదాయానికిమించిన కేసులో ఏసీపీ అరెస్టు!

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments