Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేతికి అసలు గన్ ఇస్తే..

Webdunia
మంగళవారం, 24 డిశెంబరు 2019 (22:35 IST)
వెండితెర మీద డమ్మీ గన్‌లతో ప్రత్యర్థుల మీదికి విరుచుకుపడే హీరోకి అసలైన గన్‌లు చేతికి వస్తే ఎలా ఉంటుంది. అలాంటి అవకాశం మన ఇస్మార్ట్ శంకర్, టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి వచ్చింది. రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, వివిధ పోలీసు శాఖలకు గత 25 ఏళ్లుగా తుపాకులు, ఏకే 47 లాంటి ఆయుధాలను రూపొందించి సరఫరా చేసే జెన్ టెక్నాలజీస్ సంస్థ హైదరాబాద్‌లో నిర్వహించిన రజతోత్సవ కార్యక్రమానికి రామ్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది.
 
అలాంటి అవకాశం వస్తే ఈ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఎలా ఊరుకుంటారు. గన్ చేతికి తీసుకుని ఎలా కాలిస్తే టార్గెట్ రీచ్ అవుతుందో తెలుసుకున్నారు. తన సినిమాలకు బాగా పనికి వస్తుందనుకుని ఆయుధాలకు సంబంధించిన సమాచారమంతా అడిగిమరీ తెలుసుకున్నారు. ఎంఎంజీ, ఏజీఎల్, ఏటీజీఎమ్, సీటీఎస్ఆర్, ఏకే 47… ఇలా అన్ని రకాల ఆయుధాల సమాచారం తెలుసుకోవడమే కాకుండా , చేతుల్లోకి తీసుకుని ప్రయోగాలు కూడా మొదలు పెట్టేశారు. 
 
షూటింగ్ రేంజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్ష ప్రయోగం కూడా చేశారు. ఈ అనుభవం గురించి రామ్ మాట్లాడుతూ ‘అరుదైన అనుభవమిది… సినిమా లాగా లేదు. చాలా కొత్తగానూ, థ్రిల్లింగ్ గానూ ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ సంస్థవారికి థాంక్స్ చెప్పాలి’అన్నారు. ఈ సంస్థ ఎండీ, ఛైర్మన్ అశోక్ అట్లూరి ఈ సందర్భంగా రామ్‌ను జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ప్రెసిడెంట్ కిషోర్ దత్ అట్లూరి, బిజినెస్ హెడ్ రవికుమార్ చెన్నా తదితరులు తమ కార్యక్రమానికి హాజరైనందుకు రామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దమ్ముంటే పట్టుకోర ఇన్విజిలేటర్-పట్టుకుంటే వదిలేస్తా బుక్‌లెట్.. నీయవ్వ తగ్గేదేలే.. బోర్డుపై పుష్ప డైలాగ్?

AP Assembly: సునీతా విలియమ్స్‌తో పాటు వ్యోమగాములకు ఏపీ అసెంబ్లీ అభినందనలు

ప్రేమికుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, 15 ముక్కలు.. సిమెంట్ డ్రమ్‌లో?

BJP’s Operation Akarsh వైసీపీకి చెక్.. రాజకీయ సంక్షోభం తప్పదా.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించిందా?

Lokesh: జగన్ గారికి మొబైల్ కొనిపెట్టండి.. నా జేబులో నుండి 10 కోట్లు ఇస్తాను: నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments