Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో సరిపోదా శనివారం లెన్తీ షెడ్యూల్ లో హీరో నాని ఎంటర్

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2023 (16:02 IST)
Nani new look
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెండోసారి కలిసి పని చేస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సరిపోదా శనివారం’లో నానిని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.
 
గత నెలలో ఈ సినిమా ఒక షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ రోజు, యూనిట్ కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది. ఇది లెన్తీ షెడ్యూల్ లో ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్‌లతో పాటు ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్ట్ ని చిత్రీకరించనున్నారు. నాని, ఇతర కీలక తారాగణం షూటింగ్‌లో పాల్గొంటారు.
 
అన్‌చెయిన్డ్ వీడియోలో చూపించినట్లుగా, నాని సినిమాలో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్ జే సూర్య కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.
 
పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్ జే సూర్య

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Maharashtra dog walker: నెలకు 4.5 లక్షలు సంపాదిస్తున్న మహారాష్ట్ర డాగ్ వాకర్.. చూసి నేర్చుకోండి..

Sonam: జైలులో సోనమ్ రఘువంశీ.. వందల సార్లు ఫోన్.. 1000 కిలోమీటర్లు ఒంటరిగా..?

రెండు కాళ్లు ఎత్తి ఒకే ఒక్క దెబ్బ (video)

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments