Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు 'అష్టాచమ్మా' రోజులు గుర్తుకు తెచ్చిన సినిమా.... హీరో నాని

నాని, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న చిత్రం 'మజ్ను'. 'ఉయ్యాలా జంపాలా' చిత్రాన్ని రూపొందించిన విరించి

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (13:48 IST)
నాని, అను ఇమ్మాన్యుయల్‌, ప్రియా శ్రీ హీరో హీరోయిన్లుగా ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌, కేవా మూవీస్‌ పతాకాలపై పి.కిరణ్‌, గోళ్ళ గీత అందిస్తున్న చిత్రం 'మజ్ను'. 'ఉయ్యాలా జంపాలా' చిత్రాన్ని రూపొందించిన విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ సుందర్‌ సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్‌‌లో జరిగింది. 
 
హీరో నాని మాట్లాడుతూ ''అందరూ అనుకుంటున్నట్లు బాధలో ఉండే మజ్ను కథ ఈ సినిమా కాదు. ప్రేమలో పడి సమస్యల్లో ఉన్నట్లు కనపడే ఎవరినైనా మజ్ను అనే అంటాం. ఇక మా మజ్ను సినిమా విషయానికి వస్తే బోర్‌ కొట్టదు. అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఇంటికి వెళ్ళినా గుర్తుకు వస్తుంటాడు. ఉయ్యాలా జంపాలా కథను దర్శకడు విరించి వర్మ ముందు నాకే చెప్పాడు. కాబట్టి నాకు అప్పటి నుండి మంచి పరిచయం. తను చాలా మంచి నిజాయితీ ఉన్న వ్యక్తి. తన నిజాయితీ తన సినిమాలోని ప్రతి క్యారెక్టర్‌లో కనపడుతుంది. ప్రేక్షకులు అందుకే తన సినిమాను తమదిగా భావిస్తారు. 
 
అందుకే ఉయ్యాలా జంపాలా పెద్ద హిట్‌ సాధించింది. దాని కంటే మా మజ్ను ఇంకా పెద్ద హిట్‌ సాధిస్తుంది. కిరణ్‌గారు, గీతగారితో ఎప్పటి నుండో సినిమా చేయాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నాకు అష్టాచమ్మా రోజులు గుర్తుకు తెచ్చిన సినిమా ఇది. యూనిట్‌ సభ్యులందరితో ఒక సభ్యుడిగా కలిసిపోయి ఈ సినిమా కోసం పనిచేశాను. హీరోయిన్స్‌ అనుఇమ్మాన్యుయల్‌, ప్రియాశ్రీలు చక్కగా యాక్ట్‌ చేశారు. గోపీ సుందర్‌తో భలే భలే మగాడివోయ్‌ తర్వాత చేస్తున్న మూవీ ఇది. నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ ఇచ్చారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూ చేశాం. అందరికీ థాంక్స్‌'' అన్నారు. 
 
దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, ''మనం ఎవరినైనా ఇష్టపడుతున్నప్పుడు అది ఇష్టమా? ప్రేమా? అనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాగే ప్రేమలో ఉన్నప్పుడు అది ఎన్ని రోజులు ఉంటుందనే కన్‌ఫ్యూజన్‌ వుంటుంది. అలాంటి కాన్సెప్ట్‌తో ఈ 'మజ్ను' చిత్రాన్ని రూపొందించాను. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు రొమాంటిక్‌ ఫీల్‌ ఉన్న చిత్రం'' అన్నారు. సంగీత దర్శకుడు గోపిసుందర్‌ మాట్లాడుతూ.. ''లవ్‌కి, మ్యూజిక్‌కి లాంగ్వేజ్‌ అవసరం లేదు. నాని ఈ సాంగ్స్‌ విని నా కెరీర్‌లో ఒన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ ఆల్బమ్‌ని ఇచ్చారని అనడం సంతోషాన్ని కలిగించింది. రామజోగయ్యశాస్త్రి మంచి లిరిక్స్‌ ఇచ్చారు. దర్శకనిర్మాతలు లవ్‌ అండ్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌ని రూపొందించారు. అందరికీ ఆల్‌ ది బెస్ట్‌'' అన్నారు. 
 
ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ, ''ఎనిమిది సంవత్సరాల క్రితం నాని తొలి చిత్రం అష్టా చమ్మా సెప్టెంబర్‌ 5న విడుదలైంది. ఇప్పుడు అదే నెలలో ఆడియో, సినిమా రిలీజ్‌ అవుతోంది. మంచి ప్యాషన్‌ ఉన్న హీరో. దర్శకుడు విరించివర్మ, నిర్మాతలు కిరణ్‌, గీతలకు, ఎంటైర్‌ టీమ్‌కి ఆల్‌ది బెస్ట్‌'' అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments