Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో హీరో కార్తీక్ రాజు అథర్వ

Webdunia
మంగళవారం, 17 జనవరి 2023 (17:36 IST)
Karthik Raju
కార్తీక్ రాజు హీరోగా నటిస్తున్న తాజా సినిమా అథర్వ. సిమ్రన్ చౌదరి, ఐరాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అన్ని అప్ డేట్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అతి త్వరలో పలు భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. మహేష్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. సుభాష్ నూతలపాటి నిర్మిస్తున్నారు.
 
కెరీర్ ఆరంభం నుంచే విలక్షణ కథలను ఎంచుకుంటూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు యంగ్ హీరో కార్తీక్ రాజు. ఇప్పటికే  పడేసావే, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, కౌసల్య కృష్ణ మూర్తి సినిమాలు చేసి టాలీవుడ్ ఆడియన్స్ మన్ననలు పొందారు. సిల్వర్ స్క్రీన్ పై కార్తీక్ రాజు నటనపై ప్రేక్షకులు మక్కువ చూపుతున్నారు. దీంతో కెరీర్ పరంగా బిజీగా మారిన కార్తీక్ రాజు నేడు (జనవరి 17) పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ అథర్వ యూనిట్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో కార్తీక్ రాజు సీరియస్ లుక్ లో కనిపిస్తూ సినిమాపై ఆసక్తి పెంచారు.
 
 పెగ్గో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ మీద నిర్మిస్తున్న ఈ మూవీని నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సంయుక్తంగా సమర్పిస్తున్నారు. విజయ, ఝాన్సీలు ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ ప్రముఖ పాత్రను పోషించారు. 
 
ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ తో పాటు మోషన్ పోస్టర్, గ్లింప్స్ కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభించింది. దీంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. ఇప్పుడు ఈ మూవీ చివరిదశ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రయూనిట్.. త్వరలోనే టీజర్‌, ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది.
 
క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. ఈ సినిమాలో ఇంకా ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, రొమాన్స్, కామెడీ ఇలా అన్ని జానర్లను చట్ చేసేలా సినిమా ఉంటుందని మేకర్లు అంటున్నారు. ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేశారు. డీజే టిల్లు, మేజర్ సినిమాలకు సంగీతం అందించిన శ్రీచరణ్‌ పాకాల సంగీతాన్ని అందిస్తున్నారు. చరణ్‌ మాధవనేని కెమెరామెన్‌గా, ఎస్‌బి ఉద్దవ్ ఎడిటర్‌గా వ్యహరించారు.
 
కార్తిక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా, అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుల్హన్, విజయ్ రామారాజు, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మరిముత్తు, ఆనంద్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

బొత్తిగా రోడ్ సెన్స్ లేదు, కళ్ల ముందు కనిపిస్తున్నా ఎలా ఢీకొట్టేసాడో చూడండి (video)

పవన్ కళ్యాణ్ కోసం ఎడ్లబండిపై 760 కిమీ ప్రయాణం చేసిన రైతు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments