Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళ హీరో ధనుష్‌కు ఊరట... మదురై వృద్ధదంపతుల పిటీషన్ కొట్టివేత...

తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన విషయం తెల్సిందే.

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:21 IST)
తమిళ హీరో ధనుష్‌కు కోర్టులో భారీ ఊరట లభించింది. ధనుష్ తమ కొడుకేనని, తమ బాగోగులు చూసుకోవటం లేదని పేర్కొంటూ మదురై జిల్లా మేలూర్‌కు చెందిన ఓ వృద్ధ దంపతులు కోర్టుకెక్కిన విషయం తెల్సిందే. ఈ కేసులో శుక్రవారం మద్రాసు హైకోర్టు మదురై బెంచ్ తుది తీర్పు వెల్లడించింది. వృద్ధ దంపతులు దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కోర్టు కొట్టివేసింది. 
 
హీరో ధనుష్ ఇంతకు క్రితమే తాను వాళ్ల కొడుకును కాదని, తాను 1983లో జులై 28న ఎగ్మోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతులకు జన్మించానని, అప్పట్లో తన పేరు వెంకటేశ్ ప్రభు అని, సినిమాల్లోకి వచ్చాక ధనుష్‌ కె.రాజాగా పేరు మార్చుకున్నానని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. 
 
దీనికి బదులుగా ఆ దంపతులు.. ధనుష్ 1985 నవంబర్7న మదురైలోని ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రిలో జన్మించాడని తమ వద్ద ఆధారాలున్నాయని కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఇరువురు జనన ధృవీకరణ, విద్యా సంబంధ పత్రాలను సమర్పించాలని ఆదేశించింది. వీటన్నింటితో పాటు.. వైద్య రిపోర్టులు పరిశీలించిన కోర్టు వృద్ధదంపతుల పిటీషన్‌ను కొట్టివేసింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments