Webdunia - Bharat's app for daily news and videos

Install App

2020లో పెళ్లికి ముహూర్తం.. అందుకే ఆ సినిమా నుంచి శ్రద్ధా తప్పుకుందా?

Webdunia
గురువారం, 21 మార్చి 2019 (10:22 IST)
బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కెరీర్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. గతంలో పలు హీరోలతో అఫైర్‌లు ఉన్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఏదీ ఎక్కువ రోజులు సాగలేదు. అయితే ఇటీవల భారీ ప్రాజెక్ట్ అయిన సైనా బయోపిక్ నుండి తప్పుకోవడంతో శ్రద్ధ పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వినబడుతున్నాయి.


గత కొద్ది కాలంగా శ్రద్దా కపూర్ బాల్య స్నేహితుడు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ రోషన్ శ్రేష్టతో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వచ్చిందనే రూమర్లు హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో నిజముందని సినీ వర్గాలలో ఆమె సన్నిహితులు కూడా చెప్తున్నారంట.
 
శ్రద్ధ, రోషన్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, పెద్దలకు విషయం చెప్పగా వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2020లో పెళ్లికి ముహూర్తం పెట్టినట్లు సన్నిహితుల సమాచారం. శ్రద్ధ ఒప్పుకున్న  ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా బయోపిక్ నుండి తప్పుకోవడానికి ఇది కూడా ఒక కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అందులో ఒకటి బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్. ఈ సినిమా నుంచి అనూహ్యంగా శ్రద్ధా తప్పుకోవడం వెనుక పెళ్లి కూడా ఓ కారణమని చెప్పుకొంటున్నారు. ఇక ఈ గోల్డెన్ ఛాన్స్ పరిణితి చోప్రా దక్కించుకున్న విషయం తెలిసిందే. తెలుగులో మొదటిసారిగా నటిస్తున్న సాహో చిత్రం ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments