Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసక్తి రేకెత్తించేలా హీట్ ఫస్ట్ లుక్

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2023 (16:39 IST)
Heat First Look, Director Shailesh Kolanu
సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ఆ జానర్‌కు సపరేట్ ఆడియెన్స్ ఉంటారు. అయితే ఈ మధ్య మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఇంట్రెస్టింగ్ సినిమా తెరపైకి వచ్చేసింది. 'హీట్' (ట్యాగ్ లైన్.. ఎ సైకో మైండ్ వర్సెస్ ఎ బ్రోకెన్ హార్ట్) అనే సినిమా త్వరలోనే ఆడియెన్స్‌ ముందుకు రానుంది. 
 
వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ఎం.ఆర్.వర్మ సమర్పణలో ర్యాన్ స్టూడియోస్, కౌముది సినిమాస్ బ్యానర్ల మీద ఎం.ఆర్.వర్మ, సంజోష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ఎం.ఎన్.అర్జున్, శరత్ వర్మ దర్శకత్వం వహించారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించిన ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అలానే ఈ మూవీ నుంచి హీరో ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. 
 
ప్రముఖ దర్శకుడు శైలేష్ కొలను చేతుల మీదుగా ఈ టైటిల్ పోస్టర్‌, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయించారు. ఈ టైటిల్ పోస్టర్‌తోనే సినిమా థీమ్ ఏంటన్నది చెప్పేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తుంటే.. కారు, నడిచి వస్తున్నట్టుగా మనిషి, భూతద్దం వంటివి చూస్తుంటే.. ఇది ఇన్వెస్టిగేషన్ సస్పెన్స్ థ్రిల్లర్ అని అర్థం అవుతోంది. ఏదో మర్డర్ మిస్టరీగానూ అనిపిస్తోంది. అయితే పోస్టర్‌తోనే ఈ రేంజ్‌లో ఆసక్తిని క్రియేట్ చేసి చిత్రయూనిట్ సక్సెస్ అయింది.
 
ఈ సినిమాకు గౌతమ్ రవిరామ్ సంగీతాన్ని అందించగా.. రోహిత్ బాచు కెమెరామెన్‌గా పని చేశారు. శివన్ కుమార్ కందుల, శ్రీధర్ వెజండ్ల  సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
 
నటీనటులు : వర్దన్ గుర్రాల, స్నేహా ఖుషి, మోహన్ సాయి, అంబికా వాణి, వంశీ రాజ్, పుల్కిత్, అప్పాజీ అంబరీష, జయ శ్రీ రాచకొండ, ప్రభావతి వర్మ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments