విషమంగానే నటుడు శరత్ బాబు ఆరోగ్యం..

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (13:45 IST)
తెలుగు సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రిలో ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్‌లను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉన్నట్టు వారు వెల్లడించారు.
 
కాగా, కొన్నాళ్ల క్రితం అనారోగ్యానికి గురైన శరత్ బాబు.. బెంగుళూరులో చేరి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత మరోమారు అస్వస్థతకు గురికావడంతో ఆయన ఈ నెల 20వ తేదీన బెంగుళూరు నుంచి హైదరాబాద్ నగరానికి తరలించారు. ప్రస్తుతం ఏఐజీలో చికిత్స పొందుతున్నారు. 
 
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శరత్ బాబు శరీరంలో ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయవాలు దెబ్బతిన్నట్టు సమాచారం. మరికొన్ని గంటలు గడిస్తే తప్ప ఆయన పరిస్థితి గురించి పూర్తిగా చెప్పలేమని వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

కోనసీమపై దిష్టి కామెంట్లు.. డిప్యూటీ సీఎంగా అనర్హుడు... ఆయన్ని తొలగించాలి.. నారాయణ

Stray Dogs: వీధికుక్కలతో తంటాలు.. వరంగల్‌లో వ్యక్తిని వెంబడించాయి.. డ్రైనేజీలో పడి మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments